స్టయిలిస్
స్టార్ అల్లు అర్జున్ ‘గజ
పోకిరి’గా మారబోతున్నాడు. కొంప
తీసి ఇదేదో అల్లు అర్జున్
కొత్త సినిమా అనుకోవద్దు సుమీ. ప్రస్తుతం అల్లు
అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘జులాయి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి
మలయళంలో ‘గజ పోకిరి’ అనే టైటిల్ను
ఖరారు చేశారు.
అల్లు
అర్జున్కి కేరళలో భారీ
ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య
కేరళలో జరిగిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి
బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పాటు
అల్లు అర్జున్ కూడా ముఖ్య అతిథిగా
హాజరయ్యాడంటే అతనికి అక్కడ ఉన్న ఫ్యాన్
ఫాలోయింగ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కేరళలో
భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జులాయి
షూటింగ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. ఇక్కడ
అల్లు అర్జున్, ఇలియానాపై పాటల చిత్రీకరణ జరుగుతోంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈచిత్రం జూన్ నెలలో ప్రేక్షకుల
ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోసూసూద్ ఈ చిత్రంలో మెయిన్
విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న పాటలు త్వరలోనే శ్రోతల
ముందుకు రానున్నాయి. బన్నీ ఇది వరకు
నటించిన ‘బద్రీనాథ్’ చిత్రం ఊహించిన ఫలితాలను ఇవ్వక పోవడంతో కాస్త
వెనకబడ్డ బన్నీ మళ్లీ మాస్
ఆడియన్స్ ను, యూత్ను
తన వైపు తిప్పుకోవడానికి జులాయి
అవతారమెత్తాడు.
ఈ చిత్రంలో బన్నీ పోషించిన పాత్ర
అతని కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్
అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ
చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పని చేస్తుండటం
ఈ చిత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత. డివివి
దానయ్య సమర్పణలో హారిక హాసిని క్రియేషన్స్
బేనర్ పై రాధాకృష్ణ ఈచిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
0 comments:
Post a Comment