విక్టరీ
వెంకటేష్ హీరోగా ‘షాడో’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో
వెంకీ సరసన తాప్సీ నటిస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న
ఈ మూవీని సింహా నిర్మాత పరుచూరి
కిరీటి యునైటైడ్ మూవీస్ బేనర్పై నిర్మిస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం
ఈ చిత్రంలో తాప్సీ మోడికో పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. వెంకటేష్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఓ మెడికోకి మాఫియా డాన్ కి కెమిస్ట్రీ
ఎలా వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా ఉంటుందని సినిమా యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్న మాట.
అదే విధంగా మరో హీరో శ్రీకాంత్
ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్
పాత్రలో నటిస్తున్నాడు. శ్రీకాంత్కు జంటగా మధురిమను
ఎంపిక చేశారు. షూటింగు నిమిత్తం చిత్రం ‘షాడో’ యూనిట్ సభ్యులంతా త్వరలో మలేసియా వెళ్లబోతున్నారు. రెండు నెలల పాటు
అక్కడే షూటింగ్ జరుగనుంది.
వెంకటేష్
కెరీర్లో స్టైలిష్ ఫిలింగా
ఈ సినిమా నిలుస్తుందని, తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన మాఫియా నేపథ్య చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని,
వెంకటేష్ని అమితంగా ఇష్టపడే
కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా
నచ్చుతుందని దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నాడు.
నాగబాబు,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్రుషి, ప్రభు, సూర్య,
ఉత్తేజ్, రావురమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్,
మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం:
తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్:
ప్రకాష్ ఏఎస్, ప్రొడక్షన్ కంట్రోలర్:
పి.అజయ్ కుమార్ వర్మ.
0 comments:
Post a Comment