హైదరాబాద్/న్యూఢిల్లీ: తాను ప్రధానమంత్రి పదవి
చేపట్టిన వెంటనే రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తానని కేంద్రమంత్రి
వాయలార్ రవి బుధవారం ఢిల్లీలో
చెప్పారు. బుధవారం సాయంత్రం హైదరాబాదుకు బయలుదేరిన సమయంలో ఢిల్లీలో ఆయనను మీడియా పలకరించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో
కాంగ్రెసు ఇది వరకు కొంత
ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయని
చెప్పారు.
వచ్చే
ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తామని
ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవిని మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకుంటారని మీడియా ప్రశ్నిస్తే... ముందు నన్ను ప్రధానమంత్రి
పదవి చేపట్టనివ్వండి ఆ వెంటనే ఆయనను
నియమిస్తానంటూ నవ్వుతూ చెప్పారు. ఆశించిన మేరకు ఫలితాలు లేకపోతే
రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి ఉంటుందో లేదో చెప్పే అధికారం
తనకు లేదని, దాని గురించి కేంద్రమంత్రి,
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ను అడగాలని సూచించారు.
తెలంగాణ
అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడుతున్నామని, ఖచ్చితంగా పరిష్కారం కనుగొంటామని చెప్పారు. కాగా రానున్న ఉప
ఎన్నికలలో కాంగ్రెసుదే విజయమని వాయలార్ రవి ఆ తర్వాత
హైదరాబాదులో అన్నారు. అయితే ఎన్ని సీట్లు
గెలుస్తామనేది బయటకు చెప్పే వ్యవహారం
కాదన్నారు. తాను రెండు వారాలు
ఇక్కడే ఉంటానని చెప్పారు.
వాయలార్
రవి బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు.
వాయలార్ ఉప ఎన్నికల ప్రచారాన్ని
పర్యవేక్షించడంతో పాటు నేరుగా ప్రచారంలో
కూడా పాల్గొంటారు. గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణలతో కలిసి కర్నూలు జిల్లా
ఆళ్లగడ్డ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
0 comments:
Post a Comment