పవన్
కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్
సింగ్ ని ప్రముఖ నిర్మాత,సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు చూసారు.
ఈ మేరకు తన అనుభూతిని
మీడియాతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..గబ్బర్
సింగ్ చూసాను. బిగినింగ్ టు ఎండింగ్ చాలా
ఇంట్రస్టింగ్ గా ఉంది. డైరక్టర్
హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని
బ్రహ్మాండంగా తీసాడు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్,డైలాగ్ డెలివరి,ఆ స్టైల్ చాలా
బాగున్నాయి. పోలీస్ ఆఫీసర్ గా పవన్ ఫెరఫార్మెన్స్
వెరీగుడ్ అన్నారు.
అలాగే...
ప్రొడ్యూసర్ సైడ్ మేకింగ్ వ్యాల్యూస్
చాలా ఎక్సట్రరార్డనరీగా ఉన్నాయి. ప్రతీ ఫైట్ డిఫెరెంట్
గ ఉంది. క్లైమాక్స్ చాలా
లావిష్ గా ఉంది. సాంగ్స్
కూడా చాలా వెరైటీగా తీసాడు.
హీరోయిన్ శృతిహాసన్ ప్రెష్ గా ఉంది. శృతికి
ఇది మంచి సక్సెస్. నిర్మాత
గణేష్ చాలా కాలం నుంచి
తెలుసు. ఆర్టిస్టు నుంచి ప్రొడ్యూసర్ అయ్యాడు.
నెంబర్ వన్ మూవీ తీసి
నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు.
ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో
ఆయన చేస్తున్న సినిమా,మిగతా సినిమాలు బాగా
సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇక ప్రస్తుతం రామానాయుడు పంజాబీలో ఓ ప్రేమ కథా
చిత్రం నిర్మిస్తున్నారు. ఈ విషయమై రామానాయుడు
మాట్లాడుతూ...ఇప్పటివరకూ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 12 బాషల్లో సినిమాలు
నిర్మించాము. 13 భాషల్లో సినిమాలు తియ్యాలన్న నా కోరిక ఇప్పుడు
చేస్తున్న పంజాబీ సినిమాతో తీరుతోంది. ఈ చిత్రంలో జిప్పీ
అగర్వాల్ హిరోగా నటిస్తారు.నవనీత్ సింగ్ దర్శకత్వం వహిస్తూండగా,ధీరజ్ రతన్ రచన
చేస్తున్నారు.
జూన్
5 నుంచి కెనడాలో షెడ్యూల్ ప్లాన్ చేసాం. ఆ తర్వాత పంజాబ్
లో ఆగస్టులో చేసే షెడ్యూల్ తో
సినిమా పూర్తవతుంది. పూర్తి ప్రేమ కధా చిత్రంగా
ఈ చిత్రం తెరకెక్కుతోంది అన్నారు. ఈ పంజాబి చిత్రంతో
రామానాయుడు అత్యధిక చిత్రాలు నిర్మించి గిన్నీస్ బుక్ ఎక్కడమే కాకుండా..అత్యధిక భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించిన భారతీయ నిర్మాతగా మరో రికార్డు క్రియేట్
చేయనున్నారు.
అలాగే
వెంకటేష్,రానా,నాగచైతన్యలతో కలిసి
నటించాలన్నది తన చిరకాల కోరిక
అన్నారు. మేం నలుగురం కలిసి
నటించటానికి కావాల్సిన సబ్జెక్టు రెడీ చెయ్యమని రైటర్స్
కి చెప్పాం. ఈ సినిమా కోసం
రెగ్యులర్ గా కథలు వింటూనే
ఉన్నాం. మా అందరికీ నచ్చితే
వెంటనే సినిమా ప్రారంభిస్తాం అన్నారు.
0 comments:
Post a Comment