మెగాస్టార్
చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడెప్పుడా
అని మెగా అభిమానులంతా ఆసక్తిగా
ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా
సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల
ప్రకారం ఈ చిత్రానికి ‘నాయకుడే
సేవకుడు’ అనే
టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
దీన్ని ఇప్పటికే ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ కూడా చేయించారట.
చిరంజీవి
రాజకీయ భవిష్యత్కు ప్లస్సయ్యేలా ఈ
చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈచిత్రాన్ని స్వయంగా చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్
రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్నారు.
చిరంజీవితో ‘ఠాగూర్’ లాంటి సూపర్ హిట్
సందేశాత్మక చిత్రాలు రూపొందించిన వివి వినాయక్ దీనికి
దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.
ఎంటర్టైన్మెంట్ విత్ పాలిటిక్స్ జోడించి
సందేశాత్మకంగా ఈ చిత్రానికి సంబంధించిన
కథను తయారు చేస్తున్నారు. 150వ
చిత్రం...పైగా చిరంజీవి సినీ
జీవితంలో చివరి చిత్రంగా దీన్ని
రూపొందిస్తుండటంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్
చేస్తున్నారు. ఇప్పటికే వందల కొద్ది కథలను
పరిశీలించారు...ఇంకా పరిశీలిస్తున్నారు.
త్వరలోనే
కథ ఖరారు కానుంది. దీనిపై
అధికారిక ప్రకటన వెలువడే రోజు కూడా ఎంతో
దూరంలో లేదు. ఈ నేపథ్యంలో
ఇందుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో? అని మెగా అభిమానులంతా
ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
0 comments:
Post a Comment