హైదరాబాద్:
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న
ప్రాంతాలలో రాజకీయ నేతలు దేవాలయాలకు వెళ్ల
వచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ గురువారం స్పష్టం
చేశారు. అయితే కోడ్ ఉల్లంఘన
ప్రాంతాలలో మాత్రం పార్టీ నినాదాలు, ప్రచారం చేయరాదని చెప్పారు. దేవాలయాలలో దర్శనం తప్పు కాదన్నారు. రాజకీయ
నినాదాలు మాత్రం ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరులు చిత్తూరు జిల్లాలోని తిరుమల దేవస్థానంలో రాజకీయ నినాదాలు చేశారా లేదా అనే అంశంపై
కలెక్టర్ను వివరణ కోరినట్లు
చెప్పారు. కలెక్టర్ సమాచారం ఇచ్చిన అనంతరం దానిపై నిర్ణయం తీసుకుంటానని భన్వర్ లాల్ చెప్పారు. వివరణ
వచ్చాక ప్రచారం చేశారా లేదా తేలుతుందన్నారు.
కాగా
వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం బుధవారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ
సమయంలో వైయస్ జగన్ అనుచరులు
పలువురు ఆలయంలోని మహాద్వారం వద్ద జై జగన్
అంటూ నినాదాలు చేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా నినాదాలు చేస్తున్న
వారిని అడ్డుకున్నారు.
ఆ తర్వాత శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థులు
తమ సమ్మతిని తెలిజయేస్తూ డిక్లరేషన్ ఫారంలో సంతకం చేయాల్సి ఉన్నప్పటికీ
జగన్ సంతకం చేయలేదు. 2009వ
సంవత్సరంలోనే శ్రీవారిని దర్శించుకున్న జగన్ అప్పుడు డిక్లరేషన్
ఫారంపై సంతకం చేశారని పార్టీ
నేతలు చెబుతున్నారు. జగన్కు డిక్లరేషన్
ఫారం ఇవ్వడానికి అధికారులు 17వ నంబర్ కంపార్టుమెంట్
వద్ద నిరీక్షించినప్పటికీ అతను పట్టించుకోలేదట.
తిరుమల
తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రం అన్యమతస్థులు శ్రీవారిని దర్శించికున్న ప్రతిసారి డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాల్సిందేనని చెబుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం ప్రతిసారి సంతకం చేయాల్సిన అవసరం
లేదని చెబుతున్నారు. ఒకసారి సంతకం చేస్తే మళ్లీ
చేయాల్సిన అవసరం లేదని, ప్రతిసారి
చేయాల్సిందేననే రెండు వాదనలు వినిపించడంతో
అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం
లేదట.
అంతకుముందు
వైయస్ జగన్ కాన్వాయ్ నిర్దేశించిన
హద్దులు దాటి ముందుకు వెళ్లేందుకు
ప్రయత్నించడంతో నిఘా సిబ్బంది అడ్డుకున్నారు.
లోపలకు వెళ్లనివ్వమని చెప్పారు. దీంతో జగన్ అక్కడే
దిగి లోనికి వెళ్లారు. కాగా డిక్లరేషన్ ఫారంపై
జగన్ సంతకం పెట్టక పోవడాన్ని
భక్తులు తప్పు పడుతున్నారు. సంతకం
పెట్టకుండానే శ్రీవారిని దర్శించుకున్న జగన్పై చర్యలు
తీసుకోవాలని శ్రీరాం సేన డిమాండ్ చేసింది.
0 comments:
Post a Comment