శ్రీకాకుళం:
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు ఎవరికీ
ప్రయోజనం లేనివని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
సోమవారం శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఒక వ్యక్తి పదవీ
కాంక్ష వల్లే ఈ ఉప
ఎన్నికలు వచ్చాయని ఆయన వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో ఎప్పుడూ వారే అధ్యక్షులుగా ఉంటారన్నారు.
ఆ పార్టీలలో అధినేతలకు ఇష్టం లేని వారు
ఉండవద్దని, ఇష్టం ఉన్న వారే
ఉండాలన్నారు. ఆ పార్టీలు డెమోక్రసీ
లేనివిగా తయారయ్యాయన్నారు. కాంగ్రెసు పార్టీలో అలా కాదన్నారు. అభివృద్ధి,
సంక్షేమ పథకాలతో ఉప ఎన్నికలకు వెళుతున్నామని
చెప్పారు. ప్రజలు అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి
మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నరసన్నపేటలో వర్షం పడుతున్నప్పటికీ కార్యకర్తలు
చూపించిన పట్టుదల, శ్రద్ధ పార్టీ విజయంపై నమ్మకం పెంచిందన్నారు.
కాంగ్రెసు
పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని
చెప్పారు. మంత్రులు హద్దు మీరితే పార్టీ
అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జలయజ్ఞం కోసం తాము నిధులు
సేకరిస్తున్నట్లు చెప్పారు. డిఎల్ పరీక్ష వాయిదా
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి
వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
పన్నెండు
జిల్లాల్లో పద్దెనిమిది నియోజకవర్గాలలో ఎన్నికల కోడ్ కారణంగా యాభై
రోజుల పాటు అభివృద్ధి పథకాలు
ఆగిపోయాయన్నారు. మంత్రులు అవకాశాలు దుర్వినియోగం చేసి హద్దులు మీరితే
చర్యలు తప్పవన్నారు. పోలవరం అభ్యంతరాలపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చలు
సాగుతున్నాయన్నారు. పోలవరంపై ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన
పరిష్కారం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
థర్మల్
పవర్ ప్లాంటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా గురించి
ప్రధానమంత్రితో చర్చించామని చెప్పారు.
0 comments:
Post a Comment