కడప:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
తనకు రాజకీయ భిక్ష పెట్టారని ఓ
పత్రిక చెబుతోందని, నాకు వైయస్ రాజకీయ
భిక్ష పెట్టలేదని, కేవలం ఆయన నాయకత్వంలో
మాత్రమే తాను పని చేశానని
చెప్పారు. పన్నెండు సార్లు ఎన్నికలలో నిలబడిన చరిత్ర తమ కుటుంబానిది అన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
తన తండ్రి రాజకీయాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి
కన్నా సీనియర్ అన్నారు. వైయస్ తండ్రి వైయస్
రాజారెడ్డి జైలులో ఉంటే విడిపించేందుకు మా
నాన్న, తాత సాయం చేశారన్నారు.
వైయస్ కుటుంబం నుండి తాము ఏమీ
లబ్ధి పొందలేదని, వారి కుటుంబానికే మా
కుటుంబం సాయం చేసిందన్నారు. జగన్
పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్, చంద్రబాబు నీతి,
నిజాయితీల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
సంక్షేమం,
అభివృద్ధిపై జగన్ మీడియా అవాస్తవాలను
ప్రజలకు చెబుతోందన్నారు. రాజకీయ వ్యవస్థ దిగజారిందని జగన్ చెప్పడం విడ్డూరంగా
ఉందన్నారు. కాంగ్రెసు చెట్టు కాయను కోసుకు తినేందుకు
జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ ఎప్పుడూ అబద్దాలు
చెప్పే వారు కాదన్నారు. జగన్,
బాబులు మాత్రం అబద్దాలలో తీసిపోరన్నారు. వైయస్ కేంద్రాన్ని ఎప్పూడూ
విమర్శించలేదన్నారు. వైయస్ను, కాంగ్రెసును
విడదీసి చూడలేమన్నారు. జగన్ అబద్దాల కోరు
అన్నారు.
చంద్రబాబు
తనకు తానే మేధావి అనుకుంటాడని,
అందరినీ మోసం చేయాలనుకుంటాడని మండిపడ్డారు.
బాబు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటాడన్నారు. బాబు ఇష్టం వచ్చినట్లుగా
మాట్లాడుతున్నారన్నారు. బాబు అన్నా హజారే
లెవల్లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ..
జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం దేనికీ
వెనుకాడరన్నారు.
జగన్
పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రంలో సైతాన్ పాలన వస్తుందని మండిపడ్డారు.
తన తండ్రి హయాంలో అక్రమార్జన సంపాదనతో పెట్టిన సాక్షి మీడియా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్
చేశారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. బాబు మాటలను ప్రజలు
ఏమాత్రం నమ్మే పరిస్థితిలో లేరని
చెప్పారు.
0 comments:
Post a Comment