Showing posts with label Kadapa. Show all posts
Showing posts with label Kadapa. Show all posts

Wednesday, June 6, 2012

Babu Blames Ys Vijayamma


కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరస్తుడిగా మారడానికి కారణం ఆయన తల్లిదండ్రులే అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు. చంద్రబాబు కడప జిల్లా రాజంపేటలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తన తనయుడు జగన్ టన్నుల కొద్ది డబ్బులు తెస్తున్నప్పుడు సంతోషించారని విమర్శించారు.

నేరస్తులైన భాను కిరణ్, మంగలి కృష్ణలతో సావాసం చేస్తే ప్రశ్నించలేదన్నారు. అప్పుడే జగన్ చేస్తున్న అసాంఘీక కార్యకలాపాలను విజయమ్మ అడ్డుకుంటే పరిస్థితి వచ్చేది కాదన్నారు. జగన్ ఇలా తయారు కావడానికి వారి తల్లిదండ్రులే కారణమన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన బెయిల్ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశారని, అతను దేవుళ్లకు కూడా లంచాలు ఇచ్చారని మండిపడ్డారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ.45 కోట్లు లంచం ఇచ్చారన్నారు. కానీ వెంకటేశ్వర స్వామి దుర్మార్గులను శిక్షిస్తారన్నారు. ఇష్టానుసారం దోపిడీ చేసిన వారిని స్వామి వదలడన్నారు. తన బెయిల్ కోసం గాలి అరవై కోట్లు ఇస్తే జగన్ ఇంకా ఎన్ని వందల కోట్లు ఇస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా పేదవాడి సొమ్ము అన్నారు. దోషుల్ని దోషులుగా చూడాలని ప్రజలకు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లనే అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. అక్రమాలు చేసి దోషులుగా నిలబడిన వారిపై సానుభూతి చూపిస్తే భవిష్యత్తులో కష్టమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. జగన్ చేసిన తప్పులకు బెయిల్ రాదన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. దివంగత వైయస్ బతికి ఉంటే జైలుకు వెళ్లే వారన్నారు.

టిడిపి నేత యనమల రామకృష్ణుడు హైదరాబాదులో మాట్లాడుతూ.. ఈసి వ్యవహారం వైయస్సార్ కాంగ్రెసుకు అనుకూలంగా ఉందని అన్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల అఫిడవిట్లను నెట్లో పెట్టిన ఈసి పార్టీ అభ్యర్థుల అఫిడవిట్లను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వాన్ పిక్ భూకేటాయింపుల ఫైలుపై సంతకం పెట్టిన మంత్రులను కస్టడీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Sunday, May 20, 2012

A Brother kills his sister


కడప: జిల్లాలో ఘోరం. పరువు హత్య జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులకి వచ్చింది. కడప జిల్లాలోని చాపాడు మండలం నెరవాడలో సోదరుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరిన తన సోదరిని హత్య చేసి పూడ్చి పెట్టాడు. పదహారు రోజుల క్రితమే సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా ఉండే గంగన్న సోదరి లలిత చాపాడులో వ్యవసాయ విస్తరణ అధికారి(ఎఈవో)గా పని చేస్తోంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని తండ్రిని, తన సోదరుడిని కోరింది. వేరే కులస్థుడితో పెళ్లికి అంగీకరించని అన్న సోదరిని దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని కుందూ నదిలో పూడ్చి పెట్టాడు.

లలిత కొద్ది రోజులుగా కనిపించక పోవడంతో గాలింపు చేపట్టిన స్థానికులు, బంధువులు చివరకు సోదరుడు చేసిన దారుణాన్ని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకిదిగిన పోలీసులు మృతదేహం కోసం వెతుకులాట ప్రారంభించారు. చాపాడు నెరవాడ ప్రాంతంలోనే కుందూ నదిలో పోలీసులు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.

మృతురాలి సోదరుడు గంగన్నను, మరో బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత అదే జిల్లాలో చాగలమర్రిలో ఏఈవోగా పని చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్యలు చాలా జరుగుతాయి. మన రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకోవడం అందరినీ కలిచి వేస్తోంది.

Sunday, May 13, 2012

CM Kiran controversial comments


కడప: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని పత్రిక చెబుతోందని, నాకు వైయస్ రాజకీయ భిక్ష పెట్టలేదని, కేవలం ఆయన నాయకత్వంలో మాత్రమే తాను పని చేశానని చెప్పారు. పన్నెండు సార్లు ఎన్నికలలో నిలబడిన చరిత్ర తమ కుటుంబానిది అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

తన తండ్రి రాజకీయాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా సీనియర్ అన్నారు. వైయస్ తండ్రి వైయస్ రాజారెడ్డి జైలులో ఉంటే విడిపించేందుకు మా నాన్న, తాత సాయం చేశారన్నారు. వైయస్ కుటుంబం నుండి తాము ఏమీ లబ్ధి పొందలేదని, వారి కుటుంబానికే మా కుటుంబం సాయం చేసిందన్నారు. జగన్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్, చంద్రబాబు నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

సంక్షేమం, అభివృద్ధిపై జగన్ మీడియా అవాస్తవాలను ప్రజలకు చెబుతోందన్నారు. రాజకీయ వ్యవస్థ దిగజారిందని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెసు చెట్టు కాయను కోసుకు తినేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ ఎప్పుడూ అబద్దాలు చెప్పే వారు కాదన్నారు. జగన్, బాబులు మాత్రం అబద్దాలలో తీసిపోరన్నారు. వైయస్ కేంద్రాన్ని ఎప్పూడూ విమర్శించలేదన్నారు. వైయస్ను, కాంగ్రెసును విడదీసి చూడలేమన్నారు. జగన్ అబద్దాల కోరు అన్నారు.

చంద్రబాబు తనకు తానే మేధావి అనుకుంటాడని, అందరినీ మోసం చేయాలనుకుంటాడని మండిపడ్డారు. బాబు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటాడన్నారు. బాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. బాబు అన్నా హజారే లెవల్లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం దేనికీ వెనుకాడరన్నారు.

జగన్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రంలో సైతాన్ పాలన వస్తుందని మండిపడ్డారు. తన తండ్రి హయాంలో అక్రమార్జన సంపాదనతో పెట్టిన సాక్షి మీడియా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. బాబు మాటలను ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget