హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర అంతా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి
తెలుసునని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర
రావు సోమవారం విమర్శించారు. ఆయన పార్టీ కార్యాలయంలో
విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అప్పుడు జగన్ తాత వైయస్
రాజారెడ్డిని కిరణ్ తండ్రి జైలు
నుండి విడిపిస్తే, ఇప్పుడు కిరణ్ జగన్ను
రక్షిస్తున్నారని ఆరోపించారు.
నాటి
ముఖ్యమంత్రి వెంగళరావుతో మాట్లాడి రాజారెడ్డిని కేసుల నుంచి బయటకు
తెచ్చింది తన తండ్రేనని, అదేవిధంగా
జగన్ను పరిటాల రవి
హత్య కేసు నుంచి తప్పించింది
తానేనని కిరణ్ రెడ్డియే స్వయంగా
చెప్పారన్నారు. జగన్ కుటుంబానికి నేర
చర్తిరలు ఉంకా చాలా ఉన్నాయని,
అవన్నీ కిరణ్కు తెలుసు
అన్నారు. అందుకే కిరణ్ను సిబిఐ
కస్టడీలోకి తీసుకొని కొన్ని రోజులు విచారిస్తే జగన్ అక్రమాలు, నేరచరిత్ర
అంతా బయటకు వస్తుందని అన్నారు.
జగన్
అవినీతి, నేర చరిత్ర అంతా
తెలిసినా కిరణ్ బయటపెట్టలేదని, అతనితో
కుమ్మక్కైనందునే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే ముఖ్యమంత్రి
పదవి పోతుందనే భయంతో జగన్ పైన
విమర్శలు చేస్తున్నారన్నారు. తాను జగన్ పార్టీలోకి
వెళ్తానో లేకుంటే జగనే కాంగ్రెసులోకి వస్తారో
అన్నది ఇంకా తెలియనందునే.. జగన్
అవినీతి, అక్రమాల విషయంలో ఏమీ పట్టనట్లుగా కిరణ్
ఉన్నారని మండిపడ్డారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలో 55 వేల ఎకరాలను అక్రమంగా
ధారాదత్తం చేశారని కాగ్ తన నివేదికలో
పేర్కొన్నా వాటిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు.
నాటి భూదందాపై సభా సంఘం వేస్తానని
కిరణ్ ఉభయ సభల్లో హామీ
ఇచ్చి మోసం చేశారన్నారు. జగన్
అక్రమంగా ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఉపయోగపడిన 26 జివోలపై చర్యలు లేవన్నారు.
జగన్కు చెందిన సరస్వతీ
పవర్కు సున్నపురాయి గనులను
రద్దు చేయాలని గనుల శాఖ డైరెక్టర్
ఆరు నెలల కిందట పంపిన
ప్రతిపాదన ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతోందని, జగన్ బావ మరిది
అనిల్ కుమార్కు చెందిన రక్షణ
స్టీల్స్కు ఖమ్మం జిల్లాలో
కేటాయించిన లక్షన్నర ఎకరాల ఇనుప ఖనిజం
గనుల కేటాయింపును కేంద్రం రద్దు చేసిందని, కాని
ఆ స్టీల్స్తో ఎపి ఎండిసి
కుదుర్చుకొన్న ఒప్పందాన్ని రద్దు చేయలేదన్నారు.
వంతాడ
గనుల్లో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పిల్లి
సుభాష్ చంద్రబోస్ నుంచి రికవరీలు చేయలేదన్నారు.
విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల కేటాయింపు రద్దు
చేయలేదన్నారు. కడప జిల్లాలో బ్రాహ్మణీ
స్టీల్స్ రాదని తెలిసినా భూ
కేటాయింపులు రద్దు చేయలేదన్నారు. ఎందుకు
వీటిపై చర్యలు లేవని ప్రశ్నించారు. జగన్
విషయంలో కిరణ్ ప్రతిపక్ష నేతలా
కాకుండా ఒక ముఖ్యమంత్రిగా తగు
చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జగన్
అక్రమాస్తులను స్వాధీనం చేసుకొన్న తర్వాతే ముఖ్యమంత్రి మాట్లాడాలన్నారు. అసలు సిబిఐ సిఎంను
విచారిస్తే జగన్కు సంబంధించిన
అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు.
0 comments:
Post a Comment