భాను
గ్యాంగ్ ఆగడాలతో సర్వం కోల్పోయి రోడ్డున
పడ్డ మరో నిర్మాత సీఐడీని
ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకున్నాడు.
అతని పేరు వెంకటరెడ్డి. సిఐడికి
ఆయన చేసిన ఫిర్యాదు ప్రకారం
వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాద్కు చెందిన వెంకటరెడ్డి
2009లో 'వాల్పోస్టర్' అనే
సినిమా ప్రారంభించారు. సినిమా పూర్తి అయ్యేసరికి.. తన వద్ద ఉన్న
2.60 కోట్లు ఖర్చయిపోవడంతో, మిగతా పనుల కోసం
సి. కల్యాణ్ ద్వారా రూ.40లక్షల రూపాయలు
ఫైనాన్స్ తీసుకుని డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. సి కళ్యాణ్ వద్ద
అప్పు తీసుకోవడమే వెంకటరెడ్డికి శాపంగా మారింది.
సినిమా
రిలీజ్ చేద్దామనుకునేలోగా కల్యాణ్ విశ్వరూపం చూపారు. తన డబ్బులు ఇచ్చేదాకా
బాక్స్ ఇవ్వనని లాక్కెళ్లారు. భానుకిరణ్తో కలిసి బెదిరించారు.
దీంతో దిక్కుతోచని వెంకటరెడ్డి తనకు మిగిలిన ఏకైక
ఆధారం ఏడెకరాల పొలాన్ని తాకట్టు పెట్టుకుని బాక్స్ ఇవ్వాలని, రిలీజ్ అయిన వెంటనే 40 లక్షలను
వడ్డీతో సహా చెల్లిస్తానని బతిమాలుకున్నారు.
సరేనన్న
కల్యాణ్ ఏడెకరాల పొలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారుకానీ.. బాక్స్ మాత్రం ఇవ్వలేదు. గట్టిగా అడిగితే.. 'రూ.కోటి ఇచ్చి
తీసుకెళ్లు' అంటూ భాను ఆయన
కణతపై గన్ పెట్టాడు. దీంతో
భయబ్రాంతులకు గురైన వెంకటరెడ్డి పొలంపైనా, సినిమా బాక్సుపైనా ఆశలు వదులుకున్నారు.
తాజాగా
భాను పోలీసులకు చిక్కడం, అతనితో సంబంధాలున్న వారిపై సిఐడి కొరడా ఝులిపిస్తున్న
నేపథ్యంలో...వెంకటరెడ్డికి కాస్త ధైర్యం వచ్చింది.
తన భార్య పిల్లలతో కలిసి
నేరుగా సిఐడిని కలిసి గోడు వెల్లబోసుకున్నాడు.
తనకు జరిగిన అన్యాయంపై సిఐడిని కలిసేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు.
0 comments:
Post a Comment