రాజమండ్రి/విశాఖపట్నం: పలు అక్రమాలకు సంబంధించి
ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఎలా అవుతాడని పిసిసి
మాజీ చీఫ్, శాసనమండలి సభ్యుడు
డి శ్రీనివాస్ సోమవారం అన్నారు. డిఎస్ విశాఖ జిల్లా
పాయకరావుపేటలో కార్యకర్తల సమావేశంలో, తూర్పు గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
జగన్
లాంటి వ్యక్తి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి
ఏమిటనేది ఆ దేవుడికే తెలుసునన్నారు.
సాక్షి దిన పత్రిక, సాక్షి
ఛానల్కు సంబంధించిన బ్యాంకు
ఖాతాలను సిబిఐ స్తంభింపజేస్తే దానిని
కాంగ్రెసు పార్టీ పైన రుద్దడం సరికాదన్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన
సంస్థలోకి డబ్బు మళ్లించుకున్నాడని ఆయన
ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి పెట్టిన పార్టీకి ప్రజలు ఎలా ఓటేస్తారో ఒకసారి
ఆలోచించుకోవాలన్నారు.
కాంగ్రెసు
పార్టీ రూపొందించిన ప్రణాళికలను అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
అమలు చేశారే గాని అంతా ఆయన
ఒక్కరే చేశారనడం సరికాదని అన్నారు. కొందరు శిఖండిలను అడ్డుపెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రాజ్యసభ సభ్యుడు
చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య కడప
జిల్లాలో అన్నారు.
చిరంజీవి
కుమార్తె ఇంట్లో దొరికిన డబ్బు తనదేనని నందగోపాల్
చెబుతున్నా వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం పనిగట్టుకొని చిరంజీవిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి దిన పత్రిక, సాక్షి
ఛానల్ రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు
చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే పథకాలపై
బహిరంగ చర్చకు సిద్ధమేనా అని జగన్కు
సిఎల్పీ సవాల్ విసిరింది. సోమవారం
నాడు చీఫ్ విప్ గండ్ర
వెంకట రమణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. జగన్ ఇల్లు చూస్తే
ఆయన కులం పేదరికమో కాదో
తెలుస్తుందన్నారు. బొత్స కర్నూలు జిల్లాపర్యటనలో
వైఎస్సార్సీపీ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని,
ఇలాగే చేస్తే ప్రజలు వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ
బెడతారని హెచ్చరించారు. చంద్రబాబు దింపుడు కల్లం ఆశతో ఉన్నారని
ఎద్దేవా చేశారు.
0 comments:
Post a Comment