హైదరాబాద్:
దమ్ము సినిమాపై జరిగిన మీడియా ముఖాముఖి కార్యక్రమంలో హీరో జూనియర్ ఎన్టీఆర్
చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ అయినట్లుగా
తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన తీరుపై తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోందని అంటున్నారు.
ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏ
దృష్టితో చేశారు, రాజకీయ కోణంలో ఆలోచించి చేశాడా లేక సినిమా భవిష్యత్తును
దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడా అనే చర్చ జరుగుతోందంటున్నారు.
జూనియర్
మాటలను నేతలు వివిధ రకాలుగా
విశ్లేషిస్తున్నారట. రాజకీయ కారణాలు కావొచ్చునని కొందరు అంటే సినిమానే కావొచ్చునని
మరికొందరు అంటున్నారని తెలుస్తోంది. జూనియర్ తన వ్యాఖ్యలతో ఇచ్చిన
కొత్త ట్విస్ట్కు ఆ పార్టీలోనూ
కొత్త రకంగా చర్చ జరుగుతోందట.
ఆయన చేసిన వ్యాఖ్యల్లో రాజకీయ
కోణం దాగి ఉన్నప్పటికీ సినిమాకా,
పార్టీకా అని వారు మల్లగుల్లాలు
పడుతున్నారట. ఇటీవల విజయవాడ పట్టణ
అధ్యక్షుడు వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.
దీనిపై
నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేశారు. మన హీరో బాలకృష్ణే
అని దమ్ము చూడవద్దని ఎస్సెమ్మెస్లు గుప్పుమన్నాయి. దీంతో
జూనియర్ తన సినిమా భవిష్యత్తు
దృష్ట్యా వెనక్కి తగ్గి ఉంటారని భావిస్తున్నారట.
అదే సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
పేరును ఎక్కడా ప్రస్తావించక పోవడాన్ని కూడా వారు గుర్తుకు
చేసుకుంటున్నారని తెలుస్తోంది.
సినిమా
కోణంలోనే ఆ వ్యాఖ్యలు చేసి
ఉంటే, టిడిపి ప్రస్తావన వచ్చినప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్, హరికృష్ణల పేరు తీసిన జూనియర్..
బాబు పేరు తీయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారట.
అంతేకాదు సినిమాల విషయానికి వచ్చినప్పుడు ఓసారి బాలయ్య పేరును
కూడా ప్రస్తావించారు. బాబు పేరు ప్రస్తావించక
పోవడం మాత్రం పార్టీ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారిందట.
నాలుగు రోజుల క్రితం జూనియర్
ఎన్టీఆర్ ఓ ముఖాముఖి కార్యక్రమంలో
వల్లభనేని వంశీ ఇష్యూ, తెలుగుదేశం
పార్టీలో తన పాత్రపై మాట్లాడిన
మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి
తీసిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment