కర్నూలు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బిజెపితో
కలువబోరని మైనారిటీలు గ్యారంటీ ఇవ్వగలరా అని ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎన్నికల ప్రచార సభలో ఆయన గురువారం
వైయస్ జగన్పై, తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై
తీవ్రంగా ధ్వజమెంత్తారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో కాంగ్రెసుతోనో,
బిజెపితోనో కలవాలని, కాంగ్రెసుకు వ్యతిరేకమైతే బిజెపితో కలుస్తారని, బిజెపికి వ్యతిరేకమైతే కాంగ్రెసుతో కలుస్తారని ఆయన వివరిస్తూ వైయస్
జగన్ బిజెపితో కలువబోరనే గ్యారంటీ ఉందా అని ఆయన
అడిగారు.
రాష్ట్రాన్ని
ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో,
చంద్రబాబుతో, బిజెపితో వైయస్ జగన్ కుమ్మక్కయి
ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తక్షణమే
ముఖ్యమంత్రి కావడానికి తన తండ్రి వైయస్
రాజశేఖర రెడ్డి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని ఆయన
అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు
సోనియా గాంధీ వల్లనే వైయస్
రాజశేఖర రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి
అయ్యారని ఆయన చెప్పారు. తెరాసతో
జగన్ కలిసేందుకు శోభా నాగి రెడ్డి
మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్నారు.
వైయస్
జగన్కు మద్దతు ఇస్తున్న
శాసనసభ్యులు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని ఆయన అడిగారు. ఆళ్లగడ్డ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి తెలుగుదేశం
నుంచి ప్రజారాజ్యంలోకి, ఆ తర్వాత కాంగ్రెసులోకి
వచ్చారని, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారని, ఆ తర్వాత ఏ
కొత్త పార్టీలోకి వెళ్తారో తెలియదని ఆయన అన్నారు. తాము
అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరిస్తూ ఇవన్నీ
అమలు చేసినందుకు వైయస్ జగన్ వర్గానికి
శోభా నాగిరెడ్డి రాజీనామా చేశారా అని ఆయన అడిగారు.
కాంగ్రెసు
ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి కుర్చీ దక్కించుకోవాలని వైయస్ జగన్ రాజీనామా
చేయించారని ఆయన అన్నారు. ప్రాంతీయ
పార్టీలు ఊసరవెల్లుల మాదిరిగా రంగులు మారుస్తాయని ఆయన అన్నారు. అందుకే
చంద్రబాబు గతంలో బిజెపితో చేతులు
కలిపారని ఆయన అన్నారు. ఆళ్లగడ్డలో
దిమ్మ తిరిగేలా కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఆళ్లగడ్డలో దౌర్జన్యాలను సహించబోమని, దౌర్జన్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.
వ్యవసాయం
గురించి చంద్రబాబు నాయుడు కబుర్లు చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అని అన్నారని
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, అయితే
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని
ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓట్లతో
రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. గంటకో
పార్టీ మార్చే వ్యక్తులకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.
కేంద్ర మంత్రి వాయలార్ రవి కూడా సభలో
మాట్లాడారు.
0 comments:
Post a Comment