ఎన్టీఆర్,
బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం
'దమ్ము'. ఈ చిత్రం విడుదలైన
రోజు నుంచి డివైడ్ టాక్
తో రన్ అవుతోంది. అయితే
కలెక్షన్స్ మాత్రం ఎక్కడా డౌన్ అవటం లేదు.
ఎక్కువ ధియోటర్స్ విడుదల చేయటం వల్ల మొదటి
మూడు రోజుల వీకెండ్ దాకాట
సోమవారం నుంచి సిటీల్లో కలెక్షన్స్
డల్ అయ్యాయి. అయితే తర్వాత ధియోటర్స్
తగ్గాక కలెక్షన్స్ స్టడీగా ఉండటం ప్రారంబించాయి. ట్రేడ్
సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి
దమ్ము చిత్రం పెద్ద లాభాలు తెచ్చే
ప్రాజెక్టు కాకపోయినా డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం నష్టం
తేని సేఫ్ ప్రాజెక్టు అంటున్నారు.
ట్రేడ్
లో ప్రచారమున్న లెక్కలు ప్రకారం దమ్ము పది రోజులకు
21.5 కోట్లు కలెక్టు చేసింది. వైజాగ్ ఎంతనేది లెక్క కలపకుండా ఈ
మొత్తాలు చెప్తున్నారు. అయితే దమ్ముని 26.75 కోట్లుకు
అమ్మటం జరిగింది. దాంతో నైజాంలో 8.35,సీడెండ్
7.2,ఈస్ట్ 2.2, వెస్ట్ 2, కృష్ణ,గుంటూరు,నెల్లూరు
కలిపి 7 కోట్లుకు అమ్మారు. మొత్తం 26.75 రాష్ట్రంలో బిజినెస్ చేసారు. వైజాగ్ ఏరియాది నిర్మాత స్వంతంగా రిలీజ్ చేసుకున్నట్లు లెక్క కాబట్టి దాన్ని
కలపాల్సిన పనిలేదు. కాబట్టి ప్రింట్స్ ఖర్చులు,పోస్టర్స్,పబ్లిసిటీ అన్ని కలిపితే 28 కోట్లు
వస్తే డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా సేఫ్ అంటున్నారు. ఇప్పటికే
ఇరవై ఒకటి దాటింది కాబట్టి...
ఆ మొత్తం చేరటం కష్టమేమి కాదంటున్నారు.
ఇక మిగతా రాష్ట్రాలు విషయానికి
వస్తే కర్ణాటకలో ఈ సినిమా తీసుకున్న
రేటు కన్నా ఎక్కువ కలెక్టు
చేసిందని చెప్తున్నారు. రచ్చ, బిజినెస్ మ్యాన్
కూడా దమ్ములాగానే కర్ణాటకలో మంచి బిజినెస్ చేసాయి.
ఓవర్ సీస్ లో మాత్రం
దమ్ము చిత్రం వర్కవుట్ కాలేదు. అక్కడ రికవరీ అవటం
కష్టమే అని చెప్తున్నారు. ఇక
మొదటే చెప్పుకున్నట్లు దమ్ము చిత్రం 28 వసూలు
చేసిందా పూర్తి సేఫ్ చిత్రం లేదా
చిన్నపాటి నష్టాలతో బయిట పడ్డ చిత్రం
అని విశ్లేషిస్తున్నారు. అది గబ్బర్ సింగ్
హవా మీద ఆధారపడి ఉంటుందని
చెప్తున్నారు.
నిర్మాత
వైపు నుంచి చూస్తే దమ్ము
చిత్రం లాభాలు తెచ్చిపెట్టిన చిత్రమే అంటున్నారు. మంచి రేటుకే క్రేజీగా
ఈ ప్రాజెక్టుని అమ్ముకోవటం జరిగింది. బోయపాటి గత విజయాలు,ఎన్టీఆర్
క్రేజ్ ఈ బిజినెస్ కి
సాయిపడ్డాయి. ఇక తమిళంలోనూ ఈ
చిత్రం ఇరవైఐదు ప్రింట్లతో స్ట్రైయిట్ గా విడుదలై బాగా
కలెక్టు చేసింది. ఇప్పుడు అక్కడ డబ్బింగ్ చేసి
విడుదల చేద్దామా..డైరక్ట్ గా శాటిలైట్ కి
ఇచ్చేద్దామా అనే ఆలోచనలో అక్కడ
కొనుక్కున్న వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment