సిల్క్
స్మితతో కలిసి పలు మలయాళ
సినిమాలకు పనిచేసిన సినీ బృందం 'ప్రొఫైల్'
పేరిట డర్టీ పిక్చర్ తరహాలో
ఒక సినిమాను రూపొందించాలనే ప్రయత్నాల్లో పడిందని, సిల్క్ స్మితను మలయాళ చిత్రసీమకు పరిచయం
చేసిన ఆంథోనీ ఈస్ట్మన్ కథా
రచనలో నిమగ్నమయ్యారని, ప్రముఖ స్క్రిప్ట్ రచయిత కలూర్ డెన్నిస్
కూడా ఈ చిత్ర నిర్మాణంలో
పాల్గొంటున్నారని, అనిల్ దర్శకత్వంలో నిర్మితమయ్యే ఈ చిత్రం షూటింగ్
జూన్ నెలలో ప్రారంభమవుతుందని, ఇందులో
సిల్మ్ స్మిత పాత్రను రిచా
పోషిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే
ఈ వార్తలను రీచా ఖండించింది. తాను
సిల్మ్ స్మిత పాత్ర ఆధారంగా
రూపొందుతున్న ఏ చిత్రంలోనూ తాను
నటించడం లేదని స్పష్టం చేసింది.
సిల్మ్ స్మిత రేంజిలో ఎక్స్
ఫోజింగ్ చేయడం నా వల్ల
కాదని, అందుకు తాను రెడీగా లేనని
తేల్చి చెప్పింది.
రీచా
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన వారధి చిత్రంలో
నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు
రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ‘బిక్రమ్
సింహా’
చిత్రంలో నటిస్తోంది. లీడర్ చిత్రం ద్వారా
పరిచయం అయిన రీచాకు పాపం
అదృష్టం కలిసి రావడం లేదు.
ఆమె నటిస్తున్న సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే
ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
అయితే
నటన, గ్లామర్ పరంగా రీచా గంగోపాధ్యాయ్కి మంచి మార్కేలే
పడుతున్నాయి. ఆమె ఇటీవల నార్వే
తమిళ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్ట్రెస్
అవార్డు సొంతం చేసుకుంది. సెల్వరాఘవన్
దర్శకత్వంలో వచ్చిన ‘మయక్కమ్ ఎన్న’ చిత్రంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్కు గాను ఆమెను
ఈ అవార్డు వరించింది.
0 comments:
Post a Comment