అంతర్జాల
దిగ్గజం గూగుల్ డ్రైవర్తో పనిలేకుండా రోడ్లపై
పరుగులు పెట్టే కారును అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.
గత కొద్ది కాలంగా దీనిని వివిధ రోడ్లపై గూగుల్
పరీక్షిస్తూ విజయవంతంగా టెస్ట్ రన్ను పూర్తి
చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని
నెవడా డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్
వెహికల్స్ గూగుల్ డ్రైవర్లెస్ కారుకి గ్రీన్
సిగ్నల్ తెలిపింది. ఈ మేరకు గూగుల్
ధరఖాస్తు చేసుకున్న లెసెన్స్ను ఈ డిపార్ట్మెంట్ ఆమోదించింది. దీంతో
గూగుల్ డ్రైవర్లెస్ కారు మామూలు
కారు మాదిరిగానే నిరతరం రద్దీగా ఉండే నగర రోడ్లపై
పరుగులు పెట్టనుంది.
ఒకప్పుడు
సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ డ్రైవర్లెస్
కార్లు ఇకపై నిజజీవితంలో కూడా
దర్శనమివ్వబోతున్నాయన్నమాట.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించుకొని గూగుల్ ఈ డ్రైవర్లెస్
కార్లను అభివృద్ధి చేసింది. గూగుల్ ఇప్పటికే ఈ కారును నిర్మాణుష్య
రోడ్లపై 1600 కిలో మీటర్లకు పైగా
టెస్ట్ రన్ చేయగా, నిరంతరం
రద్దీగా ఉండే అమెరికాలోని నగర
రోడ్లపై సుమారు 1,40,000 కిలో మీటర్లకు పైగా
టెస్ట్ రన్ చేసి శభాష్
అనిపించుకుంది.
సెన్సార్లు,
కెమెరా, శాటిలైట్ ద్వారా పనిచేసే జిపిఎస్, గూగుల్ మ్యాప్స్ వంటి వివిధ సాంకేతి
వ్యవస్థలను ఉపయోగించి గూగుల్ ఈ డ్రైవర్లెస్
కారును అభివృద్ధి చేసింది. ఇందుకోసం టొయోటా అందిస్తున్న ప్రియస్ సెడాన్ను కారును గూగుల్
ఎంచుకుంది. టొయోటా ప్రియస్ను మోడిఫై చేసి,
ఇందులో తమ సాంకేతిక పరిజ్ఞాన్ని
అమర్చి, డ్రైవర్ అవసరం లేకుండా, అలాగే
దీని వలన రోడ్డుపై ఎలాంటి
ప్రమాదం సంభవించకుండా గూగుల్ ఈ కారును విజవంతంగా
టెస్ట్ రన్ చేసింది.
ఈ సాఫ్ట్వేర్లోని గూగుల్
మ్యాప్స్, స్ట్రీట్వ్యూ అప్లికేషన్ల ద్వారా
కారు చేరాల్సిన గమ్యాన్ని, వెళ్లే దారిని గుర్తిస్తుంది. కారు ముందు భాగంలో
అమర్చిన సెన్సార్లు సుమారు 200 అడుగుల దూరంలో ఉండే వస్తువులను సైతం
గుర్తించి దానికి అనుగుణంగా కారు వేగాన్ని నియంత్రిస్తాయి.
కారు పైభాగంలో అమర్చిన హై రెజుల్యూషన్ కెమెరా
360 డిగ్రీ కోణంలో తిరుగుతూ చ్టటు పక్కల పరిసరాలను
గమనిస్తూ, ఎప్పటికప్పుడు సిస్టమ్ను అప్రమత్తం చేస్తూ
ఉంటుంది. మరి గూగుల్ కారా
మజాకా నా..!!
0 comments:
Post a Comment