నేనొక్కడ్నే
భుజాన వేసుకుని ఎందుకు శత్రువు అవ్వాలి? అందరూ కలిస్తేనే సమస్య
పరిష్కారం అవుతుంది. పెద్ద సినిమాలంటే ఒక్క
విజయవాడలోనే 20, 25 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కేవలం ఒకటి, రెండు
రోజుల కలక్షన్స్ కోసం అలా చేస్తున్నారు.
దానివల్ల మిగతా సినిమాలకు నష్టం
వాటిల్లుతోంది. శ్రమ దోపిడీ అంటుంటారు..
కానీ ఇక్కడ క్రియేటివిటీ దోపిడీ
జరుగుతోంది అన్నారు. దాసరి నారాయణరావు ఈ
రోజు(శుక్రవారం) పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన
మీడియాతో ముచ్చటిస్తూ చిన్న సినిమా సమస్యలపై
ఇలా స్పందించారు.
అలాగే...థియేటర్ల గురించి ఎవరికి సమస్య వస్తే వారు
ముందుకొస్తున్నారు. సమష్టిగా ఎవరూ రావడం లేదు.
నిజంగా అందరూ కలిసి ప్రయత్నిస్తే
మూడు నెలల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఇక్కడ
ఎవరి లాభం వారు చూసుకుంటున్నారు.
ఎవరికి వారు నాకెందుకు అని
అనుకున్నప్పుడు నేనెందుకు మాట్లాడి శత్రువుని కావాలి? నిజానికి వాస్తవాలు కఠినంగా ఉంటాయి. సినిమా తీసేవారికి, చూసేవారికి ఎటూ లాభం లేదు.
మధ్యలో దళారులు లాభపడుతున్నారు. ఇక్కడ క్రియేటివ్ దోపిడీ
జరుగుతోంది. పెద్ద సినిమాలు వస్తే
ఒకటీ రెండు రోజుల కలెక్షన్ల
కోసం అంతకు ముందు ఆడుతున్న
సినిమాలను తీసేస్తున్నారు. దీని వల్ల ఏం
కోల్పోతున్నామో, ఏం పొందుతున్నామో ఆలోచించుకోవాలి.
ఇవాళ్టి పరిస్థితుల్లో 'తాతా మనవడు', 'స్వర్గం
నరకం', 'శంకరాభరణం', 'సీతారామయ్యగారి మనవరాలు' వంటి సినిమాలు తీసినా
ఒక్క షోకే పరిమితమై పోతాయి.
అంత మోనోపాలీ ఉంది అన్నారు.
దర్శకుడిగా
150 చిత్రాలు చేసిన దాసరి తన
కలల సినిమా గురించి చెపుతూ..ఇప్పటి వరకూ నేను పౌరాణిక
చిత్రం చేయలేదు. మహాభారతం నా కలల చిత్రం.
భీష్ముడు పాత్రను ప్రధానంగా చేసుకొని అయిదు భాగాలుగా చిత్రాలు
చేయాలన్నది నా ఆలోచన. మొదటి
భాగం విడుదలైన రెండు వారాలకు తరువాత
భాగాన్ని తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నాను. అలా అయిదింటినీ వరుసగా
విడుదల చేస్తాను అన్నారు. అలాగే తన కుమారుడు
దాసరి అరుణ్‌కుమార్ ఓ
మంచి చిత్రం చేయబోతున్నాడని,త్వరలో ఆ విషయాలు తెలియజేస్తానని
దాసరి చెప్పారు.
వర్తమాన
రాజకీయాల నేపథ్యంలో దాసరి తాను చేస్తున్న
'అసెంబ్లీలో దొంగలుపడ్డారు' చిత్రం గురించి చెపుతూ...స్క్రిప్టు సిద్ధమైంది. దానికి వర్కింగ్ టైటిల్‌గా 'అసెంబ్లీలో దొంగలుపడ్డారు'
అనుకొంటున్నాను. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. ఇందులో నేనే ప్రధాన పాత్ర
పోషిస్తున్నాను. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో చెబుతాను అన్నారు. ఈ రోజు పుట్టిన
రోజు జరుపుకుంటున్న దాసరికి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు
తెలియచేస్తోంది.
0 comments:
Post a Comment