ఐశ్వర్య
రాయ్ మళ్లీ గర్భవతా? రెండో
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.... ఈ ప్రెగ్నెన్సీ, పిల్లలు
లాంటి జంజాటాలకు దూరం కావాలనే ఆమె
రెండోసారి గర్భం దాల్చిందా? వయసు
40 ఏళ్లకు చేరువ అవుతుండటం కూడా
ఇందుకు ఓ కారణమా?... ఈ
ప్రశ్నలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఐశ్వర్య
రాయ్ డెలివరీ అయి దాదాపు ఆరు
నెలలు పూర్తి కావస్తున్నా.... ఐశ్వర్య ఇంకా బరువు తగ్గలేదు.
దీన్ని బట్టి ఆమె రెండోసారి
గర్భం దాల్చిందనే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి అంటున్నారు చాలా మంది. రెండో
ప్రెగ్నెన్సీ విషయం చివరి వరకు
సీక్కెట్ గా ఉంచేందుకు ఐశ్వర్య
విదేశాల్లో ఇందుకు సంబంధించి ట్రీట్ మెంట్ తీసుకుంటోందనే వార్తలు
వినిపిస్తున్నాయి. ఇటీవల ఐశ్వర్య దుబాయ్
వెళ్లడానికి కారణం కూడా అదే
అంటున్నారు.
మరి ఈ వార్తల్లో నిజం
ఎంతో... బచ్చన్ కుటుంబం నుంచి స్పష్టమైన ప్రకటన
వెలువడితేగానీ చెప్పలేం. త్వరలో ఈ విషయమై బిగ్
బి అమితాబ్ తన బ్లాగు ద్వారా
వివరణ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఏది ఏమైనా ఐశ్వర్యరాయ్ వయసు
మించిపోక ముందే మరో బిడ్డకు
జన్మనిస్తే మంచిదని చాలా మంది అభిప్రాయ
పడుతున్నారు.
అభిమాన
తార సినిమాలకు దూరం అవ్వడం ఏమోగానీ....
ఐశ్వర్య రాయ్కి సంబంధించిన
ఏ విషయం వచ్చినా ఆసక్తిగా
తిలకిస్తున్నారు ఫ్యాన్స్. ఐశ్వర్య కూతురును ఇప్పటి వరకు మీడియాకు చూపించక
పోవడం కూడా వారిని మరింత
అసహనానికి గురి చేస్తోంది.
0 comments:
Post a Comment