తెలుగు
సినీ అభిమానుల్లో కొందరు కులాల వారిగా విడిపోయారని,
పలువురు వారసత్వ హీరోలు కులం కుళ్లును మరింత
ప్రోత్సహించడమే ఈ పరిస్థితికి కారణమని
అంటూ....ఓ ప్రముఖ టీవీ
ఛానల్ ప్రసారం చేసిన కథనం ఇప్పడు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నందమూరి, మెగా కుటుంబాల నుంచి
వచ్చిన వారసత్వ హీరోల మధ్య ఈ
కుల పిచ్చి బాగా ముదురుతోందని సదరు
చానల్ వారి ఫోటోలు చూపిస్తూ
నొక్కి చెప్పడం అందరినీ ఆలోచింపచేస్తోంది.
చిరంజీవి,
రామ్ చరణ్, బాలయ్య, జూ
ఎన్టీఆర్ లాంటి హీరోల విజువల్స్
ప్రసారం చేస్తూ...వీళ్లు స్టేజీలపై కళాకారులమంతా ఒకే కులమని పైకి
చెబుతున్నా...సినిమాల్లో మాత్రం కులం కుళ్లును ప్రదర్శిస్తున్నారని
చెప్పుకొచ్చింది. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి హీరోలు, అభిమానుల
మధ్య కుల పక్షపాతం ఉన్నప్పటికీ
ఇప్పటిలా విచ్చలవిడి తనం లేదని, కానీ
ఇప్పటి యువ హీరోలు బట్టలు
విప్పిన మాదిరి బరితెగిస్తున్నారంటూ కులం పిచ్చి హీరోలను
కడిగేసింది.
ఈ పరిస్థితుల కారణంగా... మన కులపోళ్లను ఆదరించాలనే
ఆలోచన పోయి...మన కులం ఆధిపత్యం
పెరగాలనే వంకర ఆలోచనలు పుట్టుకొస్తున్నాయని,
దీని కారణంగా అనేక వివాదాలు చేటు
చేసుకుంటున్నాయని, ఒక కులం వాళ్లు,
మరొక కులం వాళ్ల సినిమాను
నష్ట పరుచాలని చూస్తున్నారని ఆ
కథనంలో పేర్కొంది. ఇక ఇప్పటి యువ
హీరోలు తమ తాతలు, తండ్రుల
పేర్లు చెప్పుకొని మరీ రెచ్చిపోతున్నారని....‘మా తాతలు
నేతులు తాగారు...మా మూతులు వాసన
చూడండి’
అన్నచందంగా వారసత్వ హీరోలు ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శలు చేసింది.
సినీ
రంగానికి కొత్తగా పరిచయం అయ్యే టప్పుడు తాతలు,
తండ్రుల పేర్లు చెప్పుకుంటే ఫర్వాలేదుకానీ....చాలా హిట్లు కొట్టిన
తర్వాత కూడా పదే పదే
వారసత్వ పాట పాడుతూ వెగటు
పుట్టిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇరు వర్గాలకు చెందిన
వారు రాజకీయాల్లోకి వచ్చి సినిమాలను రాజకీయం
చేస్తున్నారని, సినిమాల్లో కూడా పక్తు రాజకీయ
డైలాగులు వినిపిస్తున్నాయని. ఇలాంటి చేయడం వల్ల అభిమానుల్లో
చిచ్చు రేపి కులాల మధ్య
గొడవలకు ఆజ్యం పోయడం తప్ప...
సాధించింది ఏమీ లేదని చెప్పుకొచ్చింది.
సినిమాను సినిమాగా చూస్తేనే ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని, సినిమాలు
లాభాల బాటలో నడుస్తాయని...ఇలా
సినిమాను కులాలకు, రాజకీయాలకు ముడి పెట్టడం వల్ల
విష పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆ
ఛానల్ చెప్పుకొచ్చింది. మరీ ఈ కథనంపై
ఎవరి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
0 comments:
Post a Comment