హిట్
సినిమాను ఫట్ అని చెప్పడం
అదేం ఆనందమో....అటూ దమ్ము చిత్రం
సక్సెస్ మీట్లో దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు.
తొలిరోజు దమ్ము చిత్రానికి డివైడ్
టాక్ వచ్చిన నేపథ్యంలో దాసరి పై వ్యాఖ్యలు
చేశారు. దమ్ము చిత్రాన్ని నేను
స్వయంగా చూశాను..ఈ కథను మలిచిన
తీరు బాగా నచ్చింది. ఎన్టీఆర్
కోసమే ఈ కథను తయారు
చేశారు. ఈ కథను అలా
తీయడమే కరెక్ట్. హత్యకు మరో హత్య సమాధానం
కాదని చెప్పిన సందేశం బాగా నచ్చింది అని
చెప్పుకొచ్చారు.
కెఎస్
రామారావు నుంచి చాలా రోజుల
నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నానని,
ఎన్టీఆర్ దమ్ముతో అది సాధించారు, చాలా
మంచి చిత్రం తీశారు అని దాసరి ప్రశంసించారు.
రామారావు మంచి టేస్ట్ ఉన్న
నిర్మాత...చిరంజీవిని సుప్రీం హీరో నుంచి మెగాస్టార్
చేశాడు. ఆయన స్టార్లను చూసి
సినిమా తీయరు...కథను నమ్మి తీస్తారని
దాసరి వ్యాఖ్యానించారు.
నిర్మాత
కె.ఎస్. రామారావు మాట్లాడుతూ...మా చిత్రం ఇప్పటి
వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 24 కోట్లు షేర్...అదే విధంగా యూనివర్సల్
గా రూ. 31 కోట్లు సాధించింది. మా సినిమా సత్తా
ఏమిటో ఈ వాసూళ్లను చూస్తే
తెలుస్తుంది అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ
షెడ్యూల్ స్టార్ట్ కాకముందే నేను ఈ సినిమా
నైజాం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి డిసైడ్ అయ్యాను. పెద్ద కాంబినేషన్ సినిమా
అని ధైర్యంగా తీసుకున్నాను. ఎన్టీఆర్ హీరోగా మా బ్యానర్లో వచ్చిన
‘బందావనం’ కంటే
దమ్ము చిత్రం పెద్ద హిట్టయింది అన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరితో పాటు జూ ఎన్టీఆర్,
నిర్మాత కె.ఎస్.రామారావు,
బోయపాటి శ్రీను, దిల్ రాజు, కీరవాణి,
ఎన్టీఆర్, కార్తీక, ఇతర టెక్నీషియన్లు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment