రామ్
గోపాల్ వర్మ తాజా చిత్రం
డిపార్టమెంట్ క్లైమాక్స్ ని రీసెంట్ గా
రీషూట్ చేసారని సమాచారం. అయితే దాన్ని అత్యంత
రహస్యంగా క్రిందటి వారం ఫినిష్ చేసినట్లు
తెలుస్తోంది. ఈ నెల 18న
విడుదలకు సిద్దమవుతున్న సమయంలో ఈ మార్పు అందరినీ
ఆశ్చర్యపరుస్తోంది. అయితే సంజయ్ దత్
ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ కావటంతో
అతను సినిమా చూసి క్లైమాక్స్ లో
ఏదో మిస్సైనట్లు ఉందని చెప్పటంతో,రానా,సంజయ్ దత్ ల
మధ్య ఫైట్ పెట్టి సినిమాకు
గ్రాండియర్ లుక్ తెచ్చారని బాలీవుడ్
మీడియా అంటోంది. ఇక రీషూట్ అయ్యాక
వర్మ..సంజయ్ ని మెచ్చుకుని...రీషూట్ చేయటంతో ఇంకా బాగా వచ్చిందని
చెప్పి ధాంక్స్ చెప్పారు.
వర్మ
ఈ చిత్రం గురించి చెపుతూ.. ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్
లుకు చెందిన సినిమా డిపార్టమెంట్ అని అన్నారు. ముంబైలోని
మాఫియాని ఎలిమినేట్ చేయటానికి ఏర్పాటైన ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్
గురించి..ఆ క్రమంలో పోలీస్
డిపార్టమెంట్ ఎదుర్కొనే స్ట్రగుల్స్ గురించి ఉంటుందని అన్నారు.ఈ చిత్రంలో అమితాబ్
బచ్చన్ ..గ్యాంగస్టర్ గా ప్రధాన పాత్ర
పోషిస్తున్నారు. ఆయన పాత్ర పేరు
సర్జేరావు గైక్వాడ్. అలాగే దగ్గుపాటి రానా
పోలీస్ అధికారిగా,సంజయ్ దత్ ఓ
కీలకమైన రోల్ ని పోషిస్తున్నారు.
మంచు లక్ష్మి..సంజయ్ దత్ కి
భార్యగా కనిపించనుంది. డిపార్టమెంట్ చిత్రం ఈ నెల 18న
విడుదల కానుంది.
వీళ్లు
కాకుండా తెలుగులోని దగ్గుపాటి రానా,లక్ష్మి మంచు,మధు షాలని కూడా
చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు. మధు షాలిని ఫిమేల్
గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.
ఇక మధుశాలిని పాత్ర సినిమాకి హైలెట్
కానుందని చెప్తున్నారు.ఆమె సినిమా అంతా
పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది.ఆమె ఇంతకాలం సాఫ్ట్
రోల్ లో కనిపించింది.ఇప్పుడు
చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో
అదరకొట్టనుందని,ఆమె పాత్ర సినిమాకి
హైలెట్ అని చెప్తున్నారు.
డిపార్టమెంట్
చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్
మధ్యన ఉండే సంభందాలని ముఖ్య
కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది.దీంట్లో
అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా
మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను
పోషిస్తున్నాడు.సంజయ్ దత్ అండర్
వరల్డ్ ని సమూలనంగా నాశనం
చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్
వేస్తున్నారు.అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన
క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు.విజయ్ రాజ్ పరారీలో
ఉన్న ఒక మాఫియా డాన్
రోల్ పోషిస్తున్నారు.
'డిపార్ట్మెంట్'లో శివనారాయణ
గా రానా ఓ ఢిపెరెంట్
పాత్రను పోషిస్తున్నాడు. మొదటి చేతిలో రివాల్వర్
కి పని పెట్టి(కాల్చి)
తర్వాత నోటి కి పనిపెట్టే
(మాట్లాడే)పాత్రలో రానా జీవించాడంటున్నారు. తన గౌవరించే
వ్యక్తులకు ఒబీడియంట్ గా ఉండే ఈ
పాత్ర రానా కి మంచి
పేరు తెచ్చి పెట్టి బాలీవుడ్ లో నిలబెట్టేది అవుతుంది
అంటున్నాడు. చిత్రంలోని తన పాత్ర గురించి
రానా చెపుతూ..." నా రెండో హిందీ
సినిమా 'డిపార్ట్మెంట్'లో పోలీసాఫీసర్గా కనిపించబోతున్నాను. ఇది ఓ
క్లాసిక్ పోలీస్ డ్రామా. ముంబై మాఫియా చక్రం తిప్పుతున్న రోజుల్లో
దాన్ని అదుపు చేయడానికి ఏర్పాటుచేసిన
ప్రత్యేక 'డిపార్ట్మెంట్' కథ ఇది. సంజయ్దత్ సీనియర్ ఆఫీసర్గా, నేను కొత్తగా
రిక్రూట్ అయిన యువకునిగా నటించాం.
అమితాబ్ బచ్చన్ ఓ రాజకీయ నాయకునిగా
కనిపిస్తారు'' అని చెప్పుకొచ్చాడు.
0 comments:
Post a Comment