సూపర్
స్టార్ మహేష్ బాబు అంతటి
హాండ్సమ్ హీరో ప్రస్తుతం ఉన్న
హీరోల్లో ఎవరూ లేరని కొత్తగా
చెప్పక్కర్లేదు. మహేష్ అందాన్ని చూసి
హీరోయిన్లు కూడా కుళ్లుకుంటారంటే అతిశయోక్తి
కాదేమో. త్వరలో తన తోటి హీరోలు
సైతం తనను చూసి ఈర్ష్య
పడేలా మహేష్ బాబు ఎంట్రీ
ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం
మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో
ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో
మహేష్ బాబు ఇదివరకు ఏ
సినిమాలో లేని విధంగా స్పెషల్గా ప్రత్యేకమైన లుక్తో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ
చిత్రం షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రం యూనిట్
సభ్యుల నుంచి అందిన సమాచారం
ప్రకారం ఇందులో మహేష్ బాబు మరింత
యంగ్గా, మరింత ఫిట్గా కనిపిస్తారని తెలుస్తోంది.
ఇందుకోసం
మహేష్ బాబు స్సెషల్ డైట్
తీసుకోవడంతో పాటు....నిపుణుల పర్యవేక్షణలో వర్కౌట్లు సైతం చేస్తున్నారు. కండలు
తిరిగి సిక్స్ ప్యాక్ బాడీలా కాకుండా ఫిట్ అండ్ డైనమిక్గా తన బాడీని
మలుచుకుంటున్నాడు. ఈ చిత్రంలో మహేష్
బాబు షర్ట్ లెస్గా
తన బాడీని ప్రదర్శిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్
గా నటిస్తోంది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తున్నారు. మహేష్‌తో
‘దూకుడు’ చిత్రాన్ని
నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని
నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్బాబు తొలిసారిగా
నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో
ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల
ముందుకు రానుంది.
0 comments:
Post a Comment