విజయవాడ:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ నెల 28న
కోర్టుకు హాజరవ్వమని సమన్లు ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ అధికారులు అరెస్టు
చేస్తే రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు
ఆయన అనుచరులు సన్నాహాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మైలవరం శాసన
సభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఆదివారం
విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
జగన్
అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం
చేస్తున్న నేపథ్యంలో అతని అనుచరులు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల
దివాకర్ రెడ్డి, పులివెందుల కృష్ణ తదితరులు మారణాయుధాలు,
బాంబులతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు బాంబులు,
మారణాయుధాలు తరలుతున్నాయని ఆరోపించారు. పులివెందుల నుండి రౌడీలను దించేందుకు
కుట్రదారులు యత్నిస్తుంటే ఇంటెలిజెన్స్ అధికారులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అక్రమంగా
దోచుకొని మూడు కేసుల్లో తొలి
ముద్దాయిగా ఉన్న జగన్ ఆస్తులను
సిబిఐకి జఫ్తు చేసే ధైర్యం
లేకపోయిందని మరో నేత సోమిరెడ్డి
చంద్రమోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు
నెల్లూరులో విమర్శించారు. బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ
చరిత్రలో ఒక వ్యక్తి పాల్పడ్డ
అవినీతికి రాష్ట్రంలోని అధికారులు, వ్యాపారవేత్తలు జైలుపాలవడం ఇదే తొలిసారన్నారు.
నదులన్నీ
సముద్రంలో కలిసినట్లుగా రాష్ట్రంలో జరిగిన అవినీతి, ఆకృత్యాలన్నింటినీకి జగనే మూలకారణమన్నారు. దోపిడీలకు
పాల్పడ్డ వారందరూ మీడియాను పెట్టుకొని బతకడం సరికాదన్నారు. అక్రమ
ఆస్తులకు నిలయమైన జగన్ మీడియాను పెట్టుకొని
బతకడం సరికాదన్నారు. అక్రమ ఆస్తులకు నిలయమైన
జగన్ మీడియా ఖాతాలను సీజ్ చేయడం బ్లాక్
డే ఎలా అవుతుందో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి
జగన్ అవినీతి ఇప్పుడు గుర్తుకు వచ్చాందా అని ప్రశ్నించారు.
0 comments:
Post a Comment