నాగార్జున
హీరోగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ' డమరుకం'. చాలా కాలం క్రితం
ప్రారంభమైన ఈ చిత్రం జూలై
6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ
చిత్రానికి సంభందించి రీసెంట్ గా రామోజీ ఫిల్మ్సిటీలో ముఖ్య సన్నివేశాలు చిత్రించారు.
మరో వైపు విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు
నడుస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ''నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో
ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో
ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు.
ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా
గ్రాఫిక్స్ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నాము''
అన్నారు. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా
చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్
శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ
శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా
మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన
అభిమన్యు సింగ్ ఇందులో విలన్
గా కనిపించనున్నారు.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన
యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో
యముడు భూమి మీదకు వస్తాడు.
ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి
దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ
మధ్య జరిగే కథనం ఆసక్తి
గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా
మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్
తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది
అన్నారు. ఆర్.ఆర్.మూవీ
మేకర్స్ వారు ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
అలాగే
ఈ చిత్రంలో దాదాపు గంటసేపు గ్రాఫిక్స్ ఉంటాయని,తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని
విధంగా వాటిని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామిడీగా సాగినా,ఇంటర్వెల్ అదిరిపోతుందని చెప్తున్నారు. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న షిర్టీ సాయి షూటింగ్ కూడా
పూర్తైంది. దాంతో ముందుగా షిర్టీ
సాయిని విడుదల చేయాలా లేక ఢమురకం రిలీజ్
చేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు.
షిర్డీ సాయి చిత్రాన్ని ప్రముఖ
దర్శకుడు రాఘవేంద్రరావు డైరక్ట్ చేసారు.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్
సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్ నిర్మాత. ప్రకాష్రాజ్, గణేష్ వెంకట్రామన్, దేవన్, అవినాష్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, రఘుబాబు, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహనిర్మాత:
వి.సురేష్రెడ్డి, కూర్పు: గౌతమ్రాజు, ఛాయాగ్రహణం:
ఛోటా కె.నాయుడు, సంగీతం:
దేవిశ్రీప్ రసాద్.
0 comments:
Post a Comment