తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు అన్ని కంపెనీలు ఫేస్బుక్ వంటి సోషల్
నెట్వర్కింగ్ వెబ్సైట్లను
ఆశ్రయిస్తుంటే, అమెరికాకు చెందిన ఆటో దిగ్గజం జనరల్
మోటార్స్ ఫేస్బుక్లో
తాము ప్రకటనలు చేయబోమని తేల్చి చెప్పేసింది. సోషల్ నెట్వర్కింగ్
సైట్లలో వచ్చే ప్రకటనలపై ఎవ్వరూ
పెద్దగా ఆసక్తి చూపబోరని, పైపెచ్చు ఇవి కస్టమర్లపై కొద్దిగా
వ్యతిరేక ప్రభావాన్ని కూడా చూపించవచ్చని జనరల్
మోటార్స్ భావిస్తోంది.
ఈ విధంగా, కంపెనీ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సోషల్ నెట్వర్కింగ్ లపై డబ్బును వెచ్చించడానికి
బదులు సాంప్రదాయ పద్ధతిలో (టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, వార్తా పత్రికల్లో ప్రచురణలు, హోర్డింగ్లు మొదలైనవి) ప్రచారం
నిర్వహించడమే ఎంతో ఉత్తమమని జనరల్
మోటార్స్ భావిస్తోంది. అయితే, ఫేస్బుక్ తమ
మొడళ్లు, బ్రాండ్లకు సంబంధించిన ఫ్యాన్
పేజ్లను మాత్రం తొలగించమని,
కేవలం ప్రకటనలు ఇవ్వడాన్ని మాత్రమే నిలిపివేస్తున్నామని జనరల్ మోటార్స్ స్పష్టం
చేసింది.
ఫేస్బుక్ ఖాతాలను నిర్వహించేందుకు
జనరల్ మోటార్స్ సుమారు 40 మిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఇందులో 10 మిలియన్ డాలర్లను కేవలం ఫేస్బుక్లో ప్రకటనలు చేయడానికి
ఖర్చు చేస్తుంది. 2010లో ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలపై
ఖర్చు చేసిన కంపెనీల్లో జనరల్
మోటార్స్ నాల్గవ స్థానంలో నిలిచింది. జనరల్ మోటార్స్ తీసుకున్న
ఈ నిర్ణయం పట్ల వ్యాఖ్యానించేందుకు ఫేస్బుక్
తిరస్కరించింది.
0 comments:
Post a Comment