రామ్,
తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు
కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’.
స్రవంతి రవికిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్
1 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ
కథ అంటూ ఓ వార్త
ఫిల్మ్ సర్కిల్సో లో ప్రచారమవుతోంది. దాని
ప్రకారం...ఇందులో తమన్నా ఆత్మగా కనపించనుంది. ఆ ఆత్మతో ప్రేమలో
పడి..రామ్ ఏం చేసాడన్నదే
మిగతా కథ అంటున్నారు.
ఫారిన్
వెళ్లిన రామ్ అక్కడ పేయింగ్
గెస్ట్ గా ఒకరింట్లో ఉంటాడు.
అక్కడ అతను తమన్నాతో ప్రేమలో
పడతాడు. అయితే తర్వాత తెలిసే
విషయం ఏమింటంటే...తమన్నా ఓ ఆత్మ. ఆమె
ఓ యాక్సిడెంట్ లో కోమాలకి వెళ్లి
ఉంటుంది. ఆమె ఆత్మ బయిటకు
వచ్చి మన హీరోతో ప్రేమలో
పడిందన్నమాట. అది తెలిసిన హీరో
షాక్ అవటం ఇంటర్వెల్. ఆ
తర్వాత ఆమెను కోమాలోంచి బయిటకు
తీసుకుని రావటం,ఆమె యాక్సిడెంట్
కి కారణమైన వాళ్లని మట్టుపెట్టడం ఈ కథలోని కీలకాంసం
అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం కధ
వింటూంటే ఎవరికైనా హాలీవుడ్ లో వచ్చిన జస్ట్
లైక్ హెవెన్ (2005)అనే చిత్రం గుర్తుకు
వస్తుంది. ఈ చిత్రమే హిందీలో
ఐ సియు (2006) అనే టైటిల్ తో
వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడిదే చిత్రాన్ని కొద్దిగ మార్చి తెరకెక్కించారని చెప్తున్నారు. అలాగే తెలుగు చిత్రం
రిలీజ్ రోజున ఈ చిత్రాన్ని
తమిళంలో ‘ఎన్ ఎండ్రల్ కాదల్
ఎన్బెన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం
క్యూట్ రొమాంటిక్ స్టోరీగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో
విడుదలై ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
దర్శకుడు
కరణాకరన్ మాట్లాడుతూ..అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి
రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని
పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా
ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది.
అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ
ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే
మా ' ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అన్నారు.
ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ- యువతరాన్ని
వెంటాడే ప్రేమ కథగా ఈ
చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్ఫుల్గా
చిత్రీకరించాడని చెప్పారు. అలాగే జెనీవా స్విట్జర్లాండ్లలో షూట్ చేసిన
పాటలు హైలెట్గా ఉంటాయని తెలిపారు.
రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్శెట్టి తదితరులు
నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:
జి.వి.ప్రకాష్కుమార్,
నిర్మాత: పి.రవికిషోర్, కథ,
స్క్రీన్ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.
0 comments:
Post a Comment