ఆనంద్,
హ్యాపీడేస్, లీడర్ లాంటి మనసుకు
హత్తుకునే సినిమాలను రూపొందించిన శేఖర్ కమ్ముల తాజాగా
రూపొందిస్తున్న చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ప్రస్తుతం
ఉన్న పట్టణ యువత లైఫ్
స్టయిల్ ఎలా ఉందనేది ఈ
చిత్రంలో చూపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని తొలుత
జనవరి 26, 2012న విడుదల చేయాలని
నిర్ణయించారు. కానీ ముందుగా అనుకున్న
సమయానికి విడుదల సాధ్యం కాక పోవడంతో ఫిబ్రవరి
11న విడుదల అన్నారు కానీ అనుకోని కారణాలతో
విడుదల కాలేదు.
స్వీయ
నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న
శేఖర్ కమ్ముల కొత్త వారిని తెలుగు
తెరకు పరిచయం చేస్తున్నారు. సాధారణంగా శేఖర్ కమ్ముల చిత్రాలు
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని
సొంతం చేసుకుంటాయి. ఈ చిత్రం కూడా
అదే తరహాలో ఉంటుందని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ‘లైఫ్
ఈజ్ బ్యూటిఫుల్’ ఎక్కవ శాతం షూటింగ్
హైదరాబాద్ చుట్టు పక్కల జరుపుకుంది. ఇప్పటికే
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రొడక్షన్
పనులకు సిద్ధం అవుతోంది.
ఇది వరకు తాను దర్శకత్వం
వహించిన ‘లీడర్’ చిత్రం అనుకున్న అంచనాలు చేరుకోక పోవడంతో...ఈ సినిమాపై బోలెడు
ఆశలు పెట్టుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు
మార్కెట్లో అందరి దృష్టీ ‘లైఫ్
ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంపైనే ఉంది. తక్కువ బడ్దెట్
లో తీసే శేఖర్ కమ్ముల
సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కీ, ఎగ్జిబిటిర్స్ కి
రెగ్యులర్ గా ఎక్కువ లాభాలు
తెచ్చిపెడుతూండటంతో ఈ చిత్రం రైట్స్
కోసం మంచి పోటీ ఏర్పడినట్లు
సమాచారం. ముఖ్యంగా ఓవర్ సీస్ నుంచి
మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సిటీల్లోనూ ఎగ్జిబిటర్స్
కూడా ఈ చిత్రం విడుదలపై
ఆసక్తి చూపెడుతున్నారు.
0 comments:
Post a Comment