పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న
‘ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగు పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రొస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.
రేపు(మే 5) వరకు ఫస్ట్
కాపీ రెడీకానుంది. రేపు సాయంత్రానికల్లా ఈ
కాపీ సెన్సార్ బోర్డు సభ్యుల చేతికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అయితే
ఈచిత్రానికి ఎన్నికత్తెర్లు పడతాయి? అనే అంశం ఇప్పుడు
చర్చనీయాంశం అయింది. ఈ చిత్రంలో మాస్
మసాలా సాంగ్ ‘కెవ్వు కేక’లో మలైకా అరోరా
ఏమాత్రం సిగ్గుపడకుండా అందాలు ఆరబోసింది. ఈ నేపథ్యంలో కొన్ని
సీన్లు కత్తెరకు గురి కావొచ్చని అంటున్నారు.
ఇక వపర్ స్టార్ మేనరిజానికి
తగిన విధంగా దర్శకుడు హరీష్ శంకర్ పంచ్
డైలాగాలు చాలానే రెడీ చేశారు. వీటిలో
ఏమైనా డైలాగులు అభ్యంతరకరంగా ఉంటే కోతపెట్టే అవకాశం
ఉంది. ఇక చిత్రమంతా ఎంటర్
టైన్మెంట్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి నరుక్కోవడాలు, చంపుకోవడాలు తక్కువగనే ఉంటాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న
సెన్సార్ బోర్డు సభ్యలు నిర్ణయాలు కాస్త కఠినంగా ఉంటున్నాయి
కాబట్టి రిపోర్టు ఎలా ఉంటుందనే దానిపై
అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
అభిమన్యుసింగ్,
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు ఇతర
ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ:
జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ:
0 comments:
Post a Comment