హైదరాబాద్:
గబ్బర్ సింగ్ సినిమా నిర్మాత
బండ్ల గణేష్ ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ బినామీ అని తెలుగుదేశం పార్టీ
నేత వర్ల రామయ్య ఆరోపించారు.
ఆయన సోమవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
మాట్లాడారు. బొత్స జీవితమే బినామీల
జీవితమన్నారు. బొత్సకు అన్ని వ్యాపారాలలో బినామీలు
ఉన్నారని ఆరోపించారు. మామూలు జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్న గణేష్
కోట్లు పెట్టి సినిమాలు ఎలా తీస్తున్నారని ఆయన
ప్రశ్నించారు.
బొత్సకు
గణేష్ బినామీ అన్నారు. బండ్ల గణేష్ తెలియదని
బొత్స చెప్పగలరా అని సవాల్ విసిరారు.
తీన్ మార్, శ్రీను వైట్ల
సినిమాలకు బొత్స పెట్టుబడులు పెట్టలేదా
అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఏం
జరుగుతోందన్నారు. కాంగ్రెసు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన
రాష్ట్రాన్ని ఎవరు రక్షించాలన్నారు. దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలో మంత్రులు ప్రాంతాల వారిగా పంచుకొని దోచుకున్నారని ఆరోపించారు.
వ్యాపారాలు
పంచుకున్నారన్నారు. వైయస్ ప్రాంతానికి ఓ
రాక్షసుడ్ని తయారు చేశాడని మండిపడ్డారు.
కాంగ్రెసు పాలనలో కంచెనే చేనును మేస్తోందన్నారు. కాంగ్రెసు పాలనలో ఫిర్యాదుదారుడు పోలీసు స్టేషన్కు వచ్చి ధైర్యంగా
ఫిర్యాదు చేసే పరిస్థితి లేదన్నారు.
గణేష్ బొత్స పేరు చెప్పి
బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. బొత్స అండతోనే ఆయన
ఫైనాన్షియర్లను బెదిరిస్తున్నారన్నారు. గణేష్ పైన ఫిర్యాదు
చేసినప్పటికీ ఎందుకు కేసు నమోదు చేయలేదని
ప్రశ్నించారు. గణేష్ సినిమాలన్నింటికీ బొత్స
డబ్బులు ఇచ్చారన్నారు.
ఇవి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి
చెబుదామంటే ఆమెనే వివాదాల్లో కూరుకుపోయారన్నారు.
తన తనయుడు అసాంఘీక శక్తులతో చేతులు కలిపారన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశాలపై దృష్టి
సారించడం లేదని, కేవలం తన పదవిని
కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారన్నారు. సిబిఐ విచారణలో
భాను కిరణ్ వెల్లడించిన రాజకీయ
నేతలు, అధికారుల పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా వర్ల రామయ్య బొత్సపై
బండ్ల గణేష్ కురిపించిన ప్రశంసల
క్లిప్పింగ్లను ప్రదర్శించారు.
0 comments:
Post a Comment