హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, తెలంగాణ రాష్ట్ర
సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు
పార్టీ నేతలు సోమవారం తీవ్రస్థాయిలో
విరుచుకు పడ్డారు. మాజీ మంత్రి షబ్బీర్
అలీ, తులసి రెడ్డి తదితరులు
పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితికి కేవలం ఎన్నికలు, కలెక్షన్లే
కావాలని షబ్బీర్ అలీ ఆరోపించారు.
తెలంగాణ
అభివృద్ధికి టిఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. వైయస్
జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
చేసిన మంచి పనులను తన
ఖాతాలో వేసుకొని, చెడును మాత్రం కాంగ్రెసుకు రుద్దుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
రైతుల కోసమంటూ గతంలో కిరణ్ కుమార్
రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మారాడని భావించామని, కానీ టిడిపి తీరు
కుక్క తోకర వంకరే అన్నారు.
ప్రజలు
రెండుసార్లు రిజక్ట్ చేసిన టిడిపికి బుద్ధి
రాలేదన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో టిడిపి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని,
అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా
తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
దీనిని ప్రారంభించి కాంగ్రెసు మంచి పని చేసిందన్నారు.
కానీ టిడిపి నేత దేవేందర్ గౌడ్
అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.
వైయస్
జగన్మోహన్ రెడ్డికి మంగళి కృష్ణతో సంబంధాలు
ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని తులసి రెడ్డి అన్నారు.
కృష్ణతో జగన్ సంబంధం పద్దెనిమిది
ఏళ్ల నాటిది అన్నారు. ఆ తర్వాత పలు
సందర్భాలలో వారి మధ్య సాన్నిహిత్యం
వెల్లడైందన్నారు. ఇటీవల జగన్ ఇంట్లో
సిబిఐ సోదాలు చేసినప్పుడు మంగళి కృష్ణ పులివెందులలో
ధర్నాకు దిగారని గుర్తు చేశారు. ఇటీవల సూటు కేసు
బాంబు కేసులో తీర్పు వెలువడిన సమయంలో జగన్ అనుచరుడినని కృష్ణ
స్వయంగా చెప్పారన్నారు.
తెలంగాణ
తప్ప తమకు ప్రత్యేక ప్యాకేజీలు
ఏవీ వద్దని మంత్రి శ్రీధర్ బాబు వేరుగా అన్నారు.
తెలంగాణ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. 14ఎఫ్
రద్దు, ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభం ద్వారా కాంగ్రెసు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడిన ప్రభుత్వంగా నిరూపించుకుందని చెప్పారు. విపక్షాలు అనవసర విమర్శలు మాని
ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నంత కాలం తెలంగాణ అభివృద్ధిపై
ప్రత్యేక దృష్టి సారిస్తామని శ్రీధర్ బాబు చెప్పారు.
0 comments:
Post a Comment