హైదరాబాద్:
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీరుపై
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర
వెంకట రమణారెడ్డి పరోక్షంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేశారు. వరంగల్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనకు సమాచారం
ఇవ్వకుండా అదే జిల్లాలోని టీడీపీ
నేత అయిన ఎస్.సమ్మారావును
కాంగ్రెస్లోకి తీసుకోవడం సరికాదని
గండ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, సీనియర్
నేత అయిన డీకే సమరసింహారెడ్డిని
కాంగ్రెస్లో చేర్చుకునేందుకు వీల్లేదని
మంత్రి డీకే అరుణ స్పష్టం
చేయడంతో ఇప్పటి వరకూ ఆయనను కాంగ్రెస్లోకి తీసుకోలేదని ఆయన
గుర్తు చేసారు.
సమ్మారావు
విషయం వచ్చేసరికి స్థానిక నేతలకు కానీ.. డీసీసీ అధ్యక్షుడనైన నాకు కానీ తెలియకుండానే
కాంగ్రెస్లో చేర్చేసుకున్నారుని, ఇదేం పద్ధతని
అన్నారు. పార్టీలో నేతలను చేర్చుకునే విషయంలో ఒక్కో జిల్లాకు ఒక్కో
విధానాన్ని అనుసరించడం వల్ల కార్యకర్తల మనోభావాలు
దెబ్బతింటాయని ఆయన అన్నారు గండ్ర
శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాను
పదకొండేళ్లుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, ఎవరైనా కాంగ్రెస్లో చేరతానని వస్తే
కిందిస్థాయిలో నేతల ఆమోదం తీసుకోవాలని
చెప్పేవాడినని తెలిపారు. ఇతర పార్టీల నుంచి
నేతలను కాంగ్రెస్లోకి తీసుకొనే విషయంలో
తానెప్పుడూ స్థానిక నేతలను దాటి వచ్చే వచ్చేందుకు
ప్రయత్నించలేదని అన్నారు. స్థానిక నేతలను సమన్వయపరచి ఇతర పార్టీల నుంచి
నేతలను పార్టీలోకి తీసుకురావడం సరైన విధానమని అన్నారు.
"టీడీపీ
నేత సమ్మారావు కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా గవర్నర్
ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనప్పుడు మాత్రమే పీసీసీ అధ్యక్షుడు నాకు తెలిపారు. సమ్మారావు
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే కార్యక్రమానికి హాజరు కావాలని ఆ
సందర్భంగా బొత్స నన్ను కోరారు.
అయితే అప్పటికే నాకు వేరే కార్యక్రమం
ఉన్నందున దీనికి నేను వెళ్లలేదు. అయితే,
వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రల కంటే నా స్థాయి
తక్కువ. బహుశా.. అందువల్లనే పార్టీలో సమ్మారావు చేరే విషయాన్ని నాకు
ముందుగానే తెలిపినట్లు లేరు'' అని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment