హైదరాబాద్:
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులు ఒక్కో సినిమాకు పదుల
కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని, అయితే అంతటి రెమ్యునరేషన్కు మాత్రం వారు
ఆదాయపు పన్ను శాఖకు పన్ను
కట్టడం లేదని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ నేత గోనె ప్రకాశ్
రావు మంగళవారం ఆరోపించారు. ఆదాయపు పన్ను ఎగవేతపై చిరంజీవికి
దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
చీకటి
వ్యాపారాలు చేసి వందల కోట్ల
రూపాయల పన్ను ఎగవేసిన చరిత్ర
చిరంజీవిదని ధ్వజమెత్తారు. హైదరాబాదులో ఉంటూ పన్ను చెన్నైలో
ఎందుకు కడుతున్నారో చెప్పాలని గోనె ప్రశ్నించారు. వ్యాపారం
రాష్ట్రంలో పన్ను మాత్రం పక్క
రాష్ట్రంలో కడతారా అన్నారు. చెన్నైలోని చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో దొరికిన రూ.36 కోట్లు ఎవరివో
చెప్పాలని గోనె డిమాండ్ చేశారు.
పరకాలలో
తెరాస గెలిస్తే తెలంగాణ వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు చెబితే తాను
పోటీకి దూరంగా ఉంటానని మాజీ మంత్రి కొండా
సురేఖ మరోసారి వరంగల్ జిల్లాలో స్పష్టం చేశారు. మాజీ ఎంపి వినోద్
వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పరకాల గెలుపుతో తెరాస
నాయకుల దిమ్మ తిరగడం ఖాయమన్నారు.
చెట్టు పేరు చెప్పి కాయలు
అమ్ముకునే తెరాస నేతలకు తనను
విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
కాగా
హైదరాబాదు, సికింద్రాబాద్ లలో తాగునీటి సమస్యలపై
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మంగళవారం ఆందోళన చేపట్టింది. తాగునీటి సమస్యను తీర్చాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని జలమండలిని ముట్టడించారు. ఖైరతాబాద్ నుంచి మెట్రో వాటర్
బోర్డు కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో
ప్రదర్శన నిర్వహించారు.
0 comments:
Post a Comment