‘గుండెల్లో గోదారి’
చిత్రంలో మంచు లక్ష్మి, ఆది
పనిశెట్టి(ఒక విచిత్రం ఫేం) జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి
సంబంధించిన షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో సాగుతోంది. ఇటీవల ఈ చిత్రంలో వరదలకు
సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. వరదల్లో ఇరుక్కుని నదిలో కొట్టుకుపోతున్న మంచు
లక్ష్మి, ఆదిలపై సీన్లు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ప్రమాదంలో పడ్డారని, వెంటనే
జాలర్లు నీటిలో దూకి వారిని కాపాడినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం ద్వారా
మంచు లక్ష్మి తొలిసారిగా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా
ఆమెనే. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆదికి తమిళంలో మంచి గుర్తింపు ఉంది. కాగా ఈచిత్రంలో తాప్సీ, సందీప్ కృష్ణ మరో జంటగా
కనిపించబోతున్నారు.
ఈ చిత్రం గురించి
లక్ష్మీప్రసన్న వివరిస్తూ ' ఇప్పటి వరకూ 70 శాతం చిత్రం పూర్తయింది. ఆసక్తికరమైన కథ,
కథనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం
ఉంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న
మ్యూజికల్ థ్రిల్లర్ ఇదని చెప్పవచ్చు. జూన్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం'
అన్నారు. అలాగే ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ కూడా హైలెట్ కాబోతోంది’
అన్నారు.
గోదావరి పరిసర
ప్రాంతాల్లో దాదాపు 170గుడిసెలతో 21 ఎకరాల్లో సెట్టింగ్ వేసి 250 ఆర్టిస్టులతో షూటింగ్
జరుపుతున్నారు. మొత్తం 20 కెమెరాలు చిత్రీకరణ కోసం ఉపయోగిస్తున్నారు. పాలాని కుమార్
సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మురళి కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. 1986లో వచ్చిన వదరలు,
ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి నాగేంద్రకుమార్ దర్శకుడు.
0 comments:
Post a Comment