పవన్
కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్
సింగ్ గ్రాండ్ గా ఈ నెల
11న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్
సూపర్ హిట్ దబాంగ్ రీమేక్
గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటివరకూ
అందిన సమచారం ప్రకారం మన స్టేట్ లో885
పై చిలుకు ధియోటర్స్ లో రిలీజవుతోంది. మిగతా
ధియోటర్స్ ఖరారు కావాల్సి ఉంది.
కేవలం మన రాష్ట్రంలోనే ఇన్ని
ధియోటర్స్ విడుల అవటం రికార్డే
అంటున్నారు. ఏరియా వైజ్ ధియోటర్
లెక్కలు చూస్తే...
నైజాం
..... 290+
సీడెడ్
..... 170+
నెల్లూరు.....
40+
కృష్ణా
.......90+
గుంటూరు
.... 70+
వైజాగ్
...... 85+
ఈస్ట్
గోదావరి... 80+
వెస్ట్
గోదావరి... 60+
మొత్తం
ఎ.పి.లో రిలీజవుతున్న
ధియోటర్స్ ... 885+
ఇవి కేవలం ట్రేడ్ లో
చెప్తున్న ఇప్పటివరకూ అందిన లెక్కలు. వీటిలో
కొన్ని హెచ్చు తగ్గలు ఉండే అవకాశం ఉంది.
ఇక గబ్బర్ సింగ్ చిత్రం ఈ
మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏ
చిత్రానికి రానంత క్రేజ్ సంపాదించుకుంది.
హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందిన
ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. పంచ్
డైలాగులు,మాస్ కి కిక్కిచ్చే
పాటలు ఈ చిత్రం ప్రత్యేకతలు
అంటున్నారు. అలాగే ఫ్యాన్స్ ని
ఊపేసే పవన్ మ్యానరిజమ్స్ సినిమాకు
హైలెట్స్ అవుతాయంటున్నారు.
పరమేశ్వర
ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ
భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్,
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం:
దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
0 comments:
Post a Comment