మహేష్
బాబు, దిల్ రాజు కాంబినేషన్
లో తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం షూటింగ్ ని రాజమండ్రిలో ప్లాన్
చేస్తే... మహేష్ తాను రానని
కావాలంటే ఇక్కడే సెట్ వేసుకుని తీసుకోమని
చెప్పి ట్విస్టు ఇచ్చినట్లు సమాచారం. లొకేషన్ నేటివిటిగా ఉంటే బావుంటుందని నచ్చ
చెప్పటానికి ప్రయత్నించినా కుదురలేదని, దాంతో ఇక్కడే రామోజీ
ఫిల్మ్ సిటీలో సెట్ వేయటానికి దిల్
రాజు రెడీ అయ్యారని ఫిల్మ్
సర్కిల్స్ లో వినపడుతోంది. ఎప్పుడూ
తన మాటని హీరోలు జవదాటరని
నమ్మకంగా ఉండే దిల్ రాజు
ఈ ఊహించని ట్విస్టుకి షాక్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.
అయితే
మహేష్ అలా హైదరాబాద్ లోనే
షూట్ చేసుకోమని చెప్పటానికి కారణం కేవలం... మహేష్
భార్య నమ్రత గర్బవతి కావటమేనని
చెప్తున్నారు. సాయింత్రం ఆరు గంటలుకి ఇంటి
వద్ద ఉండాలని,అందుకు హైదరాబాద్ అయితేనే బెస్ట్ అని సుకుమార్ షూటింగ్
కు కూడా ఇక్కడే ప్లాన్
చేయమని చెప్పారని చెప్తున్నారు. మహేష్ తన కుటుంబం
కోసం సెంటిమెంట్ గా ఫీలై చెప్పటంతో
దిల్ రాజు కాదనలేకపోయాడని చెప్తున్నారు.
అయినా స్టార్ హీరో చెప్పింది ఏ
నిర్మాత మార్చగలరని కామెంట్ చేసుకుంటున్నారు.
ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మహేష్ సరసన సమంత హీరోయిన్
గా చేస్తోంది. సంగీత దర్శకుడు మిక్కీజే
మేయర్ ఈ చిత్రం కోసం
పాటలను ఆల్రెడీ సిద్దం చేసారు. అతను శ్రీకాంత్ గత
చిత్రం కొత్త బంగారు లోకం
కోసం కూడా సంగీతం అందించారు.
అప్పట్లో ఆ పాటలు మంచి
క్రేజ్ ని క్రియోట్ చేసాయి.
ఇక అనంత శ్రీరామ్ ఈ
చిత్రానికి పాటలు రాస్తున్నారు. మహేష్
బాబు ఫేవెరెట్ కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి
కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు,దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.
అలాగే
ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్
అనిసీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె
చెట్టు.. అంటే కుటుంబం అని
కాన్సెప్టుతో నిర్మితమవుతోందని దిల్ రాజు చెప్తున్నారు.
దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ మాట్లాడుతూ..‘‘వెంకటేష్, మహేష్లు మాత్రమే
కాదు. వీరిద్దరినీ మించిన మరో హీరో ఉన్నాడు
మా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో. ఆ హీరో ఎవరో
కాదు... కథ. పూర్తిగా కథపై
ఆధారపడి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కథానుగుణంగానే హీరోలను
కూడా ఎంచుకున్నాం. అదృష్టవశాత్తు వెంకటేష్, మహేష్ లాంటి సూపర్
స్టార్లు మాకు దొరికారు అంటున్నారు.
0 comments:
Post a Comment