నాని,
సమంత జంటగా గౌతమ్వాసుదేవమీనన్
దర్శకత్వంలో తేజ సినిమా ప్రొడక్షన్స్
పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న
చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఈ చిత్రంలో చేసిన నాని, సమంతలకు...
ధనుష్,శృతిహాసన్ కాంబినేషన్ లో వచ్చి డిజాస్టర్
అయిన '3' చిత్రం భయం పట్టుకుందని చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే '3'చిత్రానికి కూడా 'ఎటో వెళ్ళి
పోయింది మనస్సు'తరహా పోస్టర్ లనే
మొదటి రిలీజ్ చేసారు. హీరో,హీరోయిన్స్ ఇద్దరూ
హై స్కూల్ పిల్లల్లా కాన్వెంట్ డ్రస్ లు వేసుకునే
కనపడుతారు. అప్పుడు ఆ పోస్టర్ లు
చూసిన వారు ఏదో ఓ
టీనేజ్ ప్రేమ కథ చూడబోతున్నామనే
ఫీలింగ్ లో హైప్ క్రియేట్
చేసారు. తర్వాత అది తుస్సుమంది.
అయితే
‘ఎటో వెళ్లిపోయింది మనసు’కి మాత్రం ఆ
సమస్య లేదు అంటున్నారు. ఈ
చిత్రం ప్యూర్ లవ్ స్టోరీ కావటం
ప్లస్ అంటున్నారు. ఈ సినిమాలో సమంత,
నాని ఆరేళ్ల వయసులో కలుస్తారు. తర్వాత పదిహేనేళ్ల వయసులో కలుస్తారు. 20, 25ఏళ్ల వయసులోనూ కలుస్తారు.
ఇలా ప్రతి ఏజ్లోనూ
వాళ్ళలో వచ్చిన మార్పులు, భావోద్వేగాలు, అనుభూతులే ఈ సినిమా. నాని,సమంతలు సైతం ఈ చిత్రంపై
మంచి హోప్స్ పెట్టుకున్నారు. సమంత ఈ చిత్రంలో
తనకు డిఫెరెంట్ పాత్ర అని...టీనేజ్
అమ్మాయిగా,పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో
కనిపిస్తున్నాని చెప్తోంది.
ఈ చిత్రం నాలుగు పాటలు మినహా షూటింగ్
పూర్తయ్యింది. గౌతమ్మీనన్ మాట్లాడుతూ
-‘‘తెలుగులో నాకు మూడవ స్ట్రయిట్
ఫిలిం ఇది. ‘ఏ మాయ
చేశావె’తో పోలిస్తే సమంతలో
చాలా వైవిధ్యం కనిపించింది. అద్భుతమైన నటి ఆమెలో ఆవిష్కృతం
అయ్యింది. నాని చాలా బాగా
చేశాడు. కెమెరా ముందుకొస్తే ఎంతో లవ్లీగా కనిపించాడు
తను. వరుసగా నానీతో సినిమాలు చేయాలనిపించింది. తొలుత ఈ సినిమాకి
రహమాన్నే మ్యూజిక్ డెరైక్టర్గా అనుకున్నాం. తనకు
ఖాళీ లేకపోవడంతో ఇళయరాజాని పెట్టాం. అద్భుతమైన సంగీతాన్నందించారాయన. నేను చేసిన సినిమాల్లో
నా ఫేవరెట్ మూవీ ఇది’’ అన్నారు.
ఇళయరాజా
సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు
బిట్ సాంగ్స్ తో కలిపి తొమ్మిది
పాటలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంత శ్రీరాం ఈ
పాటలనన్నిటినీ సింగిల్ కార్డుతో రాసారు. ఈ చిత్రం ప్రోమో
ఇప్పటికే రిలీజయ్య ఇళయారాజా అభిమానుల్లో ఆసక్తిని రేపింది. గ్యారెంటీగా మ్యూజికల్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.ఇక ఎటో వెళ్లి
పోయింది టైటిల్.. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో
వచ్చిన నిన్నా పెళ్ళాడతా చిత్రంలో హిట్టైన సాంగ్ లోది. తమిళంలో
హీరోగా జీవా నటిస్తున్నారు. హిందీలో
ఆదిత్యా రాయ్ కపూర్ చేస్తూండగా
నాని తెలుగులో చేస్తున్నారు. మొదట రామ్ ని
తెలుగుకు అనుకున్నారు కానీ అభిప్రాయ భేధాలతో
రామ్ ఆ ప్రాజెక్టు నుంచి
బయిటకు వచ్చేసారు. సమంత మాత్రం ఈ
భాషల్లోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇది
ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని దర్సకుడు చెప్తున్నారు.
0 comments:
Post a Comment