హైదరాబాద్:
జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఖాతాలను తెరిపించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలు బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో
పిటిషన్ దాఖలు చేశాయి. మంగళవారం
జగన్ మీడియా సంస్థల బ్యాంక్ అకౌంట్లను సిబిఐ స్తంభింపజేసిన విషయం
తెలిసిందే. దీంతో ఈ రోజు
జగతి, ఇందిర సంస్థలు కోర్టులో
పిటిషన్ దాఖలు చేశాయి. తమ
కంపెనీలో ఇరవై వేల మంది
ఉద్యోగులు పని చేస్తున్నారని, స్తంభింప
జేస్తే వారు, వారి కుటుంబాలు
ఇబ్బందులు పడతాయని పిటిషన్లో పేర్కొన్నాయి.
తాము
రూ.25 కోట్లు న్యూస్ ప్రింట్కు వినియోగిస్తున్నామని తెలిపింది. ఈ
సందర్భంగా సాక్షి టెలివిజన్, దిన పత్రికల నిర్వహణ,
ఖర్చు, న్యూస్ ప్రింట్, ఉద్యోగుల జీతభత్యాలు తదితరుల పూర్తి వివరాలను పిటిషన్లో కోర్టుకు తెలిపారు.
స్తంభన ద్వారా ఉద్యోగులు జీవించే హక్కును కాలరాశాలని వారు ఆరోపించారు. రాష్ట్రంలో
అత్యధిక సర్య్కులేషన్ ఉన్న పత్రిక సాక్షియేనని
చెప్పారు. సాక్షి వేసిన పిటిషన్ను
స్వీకరించిన నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని
ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కాగా
మంగళవారం సిబిఐ జగన్ మీడియా
సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపివేసిన
విషయం తెలిసిందే. సాక్షి దిన పత్రికను ప్రచురించే
జగతి పబ్లికేషన్స్, సాక్షి టెలివిజన్ను నడిపే ఇందిరా
టెలివిజన్, జననీ ఇన్ఫ్రా
బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. సిఆర్పిసి 102 సెక్షన్ కింద సంక్రమించిన అధికారాలతో
సిబిఐ ఆ ఖాతాలను స్తంభింపజేసింది.
కొత్త
ఖాతాలను తెరిచి, కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని ఆ సంస్థలకు తెలిపింది.
సాక్షికి సంబంధించి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి)
ఖాతాలను, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రాకు
చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఖాతాలను సిబిఐ
స్తంభింపజేసింది. ఈ పరిణామం నేపథ్యంలో
సాక్షి యాజమాన్యం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఈరోజు నాంపల్లి సిబిఐ
కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
0 comments:
Post a Comment