హైదరాబాద్:
ఉప ఎన్నికల తర్వాత తెలంగాణపై కేంద్రానికి తమ పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు చేత లేఖ ఇప్పిస్తామని
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి
దయాకర్ రావు చేసిన ప్రకటనపై
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు
దుయ్యబట్టారు. ఈ విషయం ఎర్రబెల్లి
దయాకర్ రావు చెప్పడం కాదని,
తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇస్తామని చంద్రబాబుతో
చెప్పించాలని ఆయన అన్నారు.
తెలంగాణకు
అనుకూలంగా చంద్రబాబు ముందే లేఖ ఇచ్చి
ఉంటే 800 మంది ప్రాణాలు పోయి
ఉండేవి కాదని ఆయన అన్నారు.
తెలంగాణపై ఉప ఎన్నికల తర్వాత
కేంద్రానికి లేఖ ఇస్తామని ఎర్రబెల్లి
దయాకర్ చేసిన ప్రకటన ఎత్తుగడ
మాత్రమేనని, ఉప ఎన్నికల్లో ప్రయోజనం
పొందడానికి ఆ ప్రకటతన చేశారని
ఆయన విమర్శించారు.
తెలంగాణ
ఉద్యమానికి తెలుగుదేశం అడుగడుగునా అన్యాయం చేసిందని ఆయన అన్నారు. తెలుగుదేశం
పార్టీపై ప్రజలకే కాదు, రాజకీయ నాయకులకు
కూడా నమ్మకం పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తమ
పార్టీకి, తెలంగాణ జెఎసికి మధ్య విభేదాలు లేవని
ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం నేతలకు ప్రేమ లేదని ఆయన
అన్నారు. జెఎసిలో అంతర్భాగంగా ఉండే ఉద్యమం చేస్తామని
ఆయన చెప్పారు.
ఉప ఎన్నికలతో తెలుగుదేశం నాయకులు తెలంగాణపై కొత్త నాటకానికి తెర
తీశారని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో
ఆ ప్రాంత నాయకుడు ఎర్రం నాయుడు ఓ
మాట, తెలంగాణలో ఈ ప్రాంత నాయకుడు
ఎర్రబెల్లి దయాకర్ రావు మరో మాట
చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఉప
ఎన్నికల తర్వాత తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు మరింత స్పష్టత ఇస్తారని,
తెలంగాణపై చంద్రబాబుతో ఉప ఎన్నికల తర్వాత
కేంద్రానికి లేఖ ఇప్పిస్తామని ఎర్రబెల్లి
దయాకర్ రావు సోమవారం చెప్పారు.
0 comments:
Post a Comment