హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టులో
దాఖలు చేసిన మొదటి ఛార్జీషీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి)కు ఇచ్చేందుకు తమకు
ఎలాంటి అభ్యంతరం లేదని సెంట్రల్ బ్యూరో
ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మంగళవారం కోర్టుకు తెలిపింది. ఛార్జీషీట్ కాపీని ఈడికి ఇవ్వవచ్చునని తెలిపింది.
కాగా తమకు జగన్ ఆస్తుల
కేసుకు సంబంధించిన మొదటి ఛార్జీషీట్ ఇవ్వాలని
ఈడి సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో
పిటిషన్ దాఖలు చేసిన విషయం
తెలిసిందే.
ఈడి పిటిషన్పై సిబిఐని కోర్టు
అడిగింది. దానికి సిబిఐ అభ్యంతరం లేదని
చెప్పింది. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. జగన్ ఆస్తులపై ఈడి
ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీలాండరింగ్
కింద కేసు దర్యాఫ్తు చేస్తోంది.
ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుండి ఈ కేసు
దర్యాఫ్తు కొనసాగుతోంది. సిబిఐ కూడా జగన్
ఆస్తుల కేసులో మూడు ఛార్జీషీట్లు కోర్టులో
దాఖలు చేసింది.
కోర్టు
మొదటి ఛార్జీషీట్ను మాత్రమే పరిగణలోకి
తీసుకుంది. కాబట్టి దాని కాపీని తమకు
అప్పగించాలని ఈడి కోర్టును కోరింది.
విదేశీ కంపెనీల నిధులు జగన్ కంపెనీలలోకి అక్రమంగా
వచ్చి పడ్డాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దర్యాఫ్తు
చేస్తే అది తేలుతుదని చెప్పింది.
కాగా మనీలాండరింగ్ ద్వారా జగన్ కంపెనీలలోకి విదేశాల
నుండి డబ్బులు వచ్చి పడితే జగన్
ఆస్తులను జప్తు చేసే అధికారం
ఈడికి ఉంది.
కాగా
జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ మంగళవారం ఉదయం సిబిఐ అధికారుల
ఎదుట హాజరయ్యారు. ఆయన తన వాంగ్మూలాన్ని
అధికారులకు ఇచ్చారు. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పైన సిబిఐ కోర్టులో
కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ
బెయిల్ పిటిషన్ విచారణను 21వ తారీఖుకు వాయిదా
వేసింది.
మరోవైపు
చర్లపల్లి జైలులో ఉన్న భాను కిరణ్ను పోలీసులు తమ
అదుపులోకి తీసుకున్నారు. అతనిని మియాపూర్ కోర్టుకు తరలించారు. పిటి వారెంటు అనుమతి
తీసుకొని సైబరాబాద్ పోలీసులు భాను కిరణ్ను
విచారించే అవకాశముంది. భానుపై సైబరాబాద్ పరిధిలో పలు కేసులపై సైబరాబాద్
పోలీసులు విచారణ జరపనున్నారు.
మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో ప్రధాన
నిందితుడు అయిన భానును పోలీసులు
అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
సిఐడి పోలీసుల ముందు సూరి డ్రైవర్
మదుసూధన్ హాజరయ్యారు. ఆయనను పోలీసులు రెండో
రోజు విచారిస్తున్నారు.
0 comments:
Post a Comment