పవన్
కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్
సింగ్ రిలీజైన మార్నింగ్ షో కే సూపర్
హిట్ టాక్ తెచ్చుకుంది. కొత్త
రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రంలో ఓ
డైలాగు రాజమౌళి ఈగ చిత్రాన్ని గుర్తు
చేస్తోందంటున్నారు. ఈ నెలాఖరకు విడుదల
అవుతున్న ఈ చిత్రాన్ని ఉద్దేశించే
హరీష్ శంకర్ ఆ డైలాగు
రాసాడంటున్నారు. ఇంతకీ ఆ డైలాగు
ఏంటంటే...ఈగ వాలితే మీరు
చూసుకోండి...ఇంకా ఏదైనా వాలితే
నేను చూసుకుంటాను.
ఈ డైలాగు సినిమా ప్రారంభంలో పవన్ ఇంట్రడక్షన్ ఫైట్
అయ్యాక.. ..దొంగలను పట్టుకుని ఎవరు డబ్బు వారికి
ఇచ్చేసాక కొండవీడు జనాలని ఉద్దేశించి చెప్పిన డైలాగు అది. రాజమౌళి మీద
ఉన్న గౌరవతంతో హరీష్ శంకర్ కావాలని
ఆ డైలాగు రాసాడని చెప్తున్నారు. ఇక రాజమౌళి ఇప్పటికే
గబ్బర్ సింగ్ చిత్రం చూసి
పవన్ కళ్యాణ్ కి ఎదురుచూస్తున్న హిట్
ఇచ్చారంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈగ వచ్చేనాటికి పవన్
గబ్బర్ సింగ్ కలెక్షన్స్ ఏ
రేంజిలో ఉన్నా..రాజమౌళి చిత్రం కావటంతో ఈగ మార్కెట్ దానికి
ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
ఇక ఈగ చిత్రాన్ని చిత్రం
కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...
చీమ
- ఏనుగూ మధ్య గొడవ జరిగితే
ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి
దిగితే ఏం జరుగుతుంది? రెండు
ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై
బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం,
అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ
కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ
'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా?
ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.
'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం
ఈ కథ. అలాగని ఈగని
ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత
శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే
ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్
ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని,
సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంగీతం: ఎం.ఎం.కీరవాణి,
ఛాయాగ్రహణం: సెంథిల్కుమార్, సమర్పణ: డి.సురేష్బాబు.
0 comments:
Post a Comment