మహేష్
బాబు కెరీర్ డల్ గా ఉన్నప్పుడు
కిక్ ఇచ్చి మళ్లీ పట్టాలు
ఎక్కించిన చిత్రం 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన
ఈ చిత్రం పూర్తి స్ధాయి కామెడీగా రూపొందింది. ఈ చిత్రం సీక్వెల్
చేయాలని మహేష్ ఆసక్తి చూపుతున్నట్లు
సమాచారం. దాంతో 'దూకుడు 2'కి దర్శకుడు శ్రీను
వైట్ల స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దూకుడులోని పాత్రకు కొనసాగింపుగా ఈ చిత్రం తయారవుతోంది.
అయితే బ్యాక్ డ్రాప్ మారుతుందని,కామిడీ కూడా కొత్త తరహాలో
ఉండేటట్లుగా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు.
ఈ మేరకు పూర్తి వివరాలు
కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు...శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. వెంకటేష్ సోదరుడుగా ఈ చిత్రంలో ఆయన
కనిపించనున్నారు. సమంత హీరోయిన్ గా
చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్
రాజు నిర్మిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు,అన్నదమ్ముల అనుబంధం వంటి విషయాలను ఇందులో
చూపించనున్నట్లు దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.
ప్రస్తుతం సమంత,మహేష్ ల
వివాహానికి సంభందంచిన సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో
షూట్ చేస్తున్నారు.
ఈ చిత్రం కాక మహేష్..సుకుమార్
దర్శకత్వంలోనూ చిత్రం చేస్తున్నారు. ఈ మేరకు కొద్ది
రోజులు క్రితం ప్రత్యేకంగా వేసిన సెట్ లో
మహేష్,డాన్సర్లపై ఓ సాంగ్ చిత్రీకరించారు.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆ పాట మరో
ట్రెండ్ సెట్టర్ అవుతుందని చెప్తున్నారు. మహేష్ ఇప్పటివరకూ చేయని
జెనర్ లో ఆ చిత్రం
రెడీ అవుతోందని, ధ్రిల్లర్ నేరేషన్ లో చిత్రం నడుస్తుందని
చెప్తున్నారు. మహేష్ పాత్ర చిత్రంలో
హైలెట్ గా ఉండనుందని సమాచారం.
శ్రీను
వైట్ల విషయానికి వస్తే..ప్రస్తుతం బాద్షా చిత్రం షూటింగ్ లో ఆయన బిజీగ
ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగ చేస్తున్న ఈ
చిత్రం హిలేరియస్ ఎంటర్టనర్ అని చెప్తున్నారు. ఎన్టీఆర్
సైతం ఈ చిత్రంపై చాలా
ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ తాను చేయని కామెడీని
తెరపై చూడవచ్చని,రెండు గంటలు సేపు
కంటన్యూగా తమ చిత్రం పొట్ట
పగిలేలా నవ్విస్తుందని ఎన్టీఆర్ హామీ ఇస్తున్నాడు.
0 comments:
Post a Comment