మహేష్
బాబు నిజ జీవితంలో ఎలా
ఉన్నా..వెండి తెరమీద మాత్రం
త్వరలో రెస్పాన్స్ బులిటీస్ తీసుకోవటానకి ఆసక్తి చూపిని భాధ్యతలు పట్టని తమ్ముడుగా కనిపించనున్నాడని సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ ఇలా ఢిపెరెట్
పాత్రలో కనపిస్తాడని చెప్పుకుంటున్నారు. భాధ్యతలు తీసుకోకపోవటం వల్ల కుటుంబం ఓ
రోజు ఓ పెద్ద సమస్యలో
పడుతుందని,అన్నగారుని, కుటుంబాన్ని సేవ్ చెయ్యాల్సిన స్ధితి
వస్తుందని,ఆ స్ధితిలో మహేష్
మారి ఎలా తన కుటుంబాన్ని
నిలబెట్టాడన్నది కథ అని వినికిడి.
ఇది ఒక భావోధ్వేగాలు మిళితమైన
కుటుంబ కధా చిత్రంగా మలుస్తున్నారని
తెలుస్తోంది.
అన్న
వెంటే తమ్ముడు కూడా అడవులు పట్టిపోవడానికి
ఇది రామాయణం కాదు. తమ్ముడి కోసం
రాజ్యాన్ని ధారబోసే అన్నలూ లేరు. ఆస్తితో అడ్డగీత
గీస్తే అనుబంధం రెండు ముక్కలైపోతున్న రోజులివి.
ఇప్పుడు కూడా అన్నమాట జవదాటని
తమ్ముడున్నాడా? తండ్రి ఇచ్చిన మాట కోసం తమ
సర్వస్వం ధారబోసే తనయులు కనిపిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం
కావాలంటే మా 'సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు'సినిమా చూడాలి. 25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్
అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ
వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె
చెట్టు..అంటే కుటుంబం. టైటిల్
మంచి ఫీల్నిచ్చింది అన్నారు
దిల్ రాజు.
అలాగే
ఈ చిత్రం కాన్సెప్టు గురించి చెపుతూ...ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం
పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని
విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో,
పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే!
అందుకే బాబాయ్, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి
పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో
కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం
మా సినిమాలో చూడొచ్చు అన్నారు.
ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్బాబులు అన్నదమ్ములుగా
నటిస్తున్నారు. వారిద్దరిపై వచ్చే సన్నివేశాలు హృదయానికి
హత్తుకొంటాయి. సీత పాత్ర కథలో
చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ
ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారని అన్నారు.సమంత హీరోయిన్ గా
చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో మహేష్బాబు, సమంత
తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
వెంకటేష్,
మహేష్బాబు హీరోలుగా చేస్తున్న
ఈ చిత్రంలో సమంత ..మహేష్ సరసన చేస్తోంది.
ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో మహేష్బాబు, వెంకటేష్
లపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం:
గుహన్, సహ నిర్మాతలు: శిరీష్,
లక్ష్మణ్.
0 comments:
Post a Comment