చాలాసార్లు
మనం కొన్ని అనారోగ్య సమస్యలకు పురాతన పధ్ధతులలో మందులు వాడుతూంటాం. వాటిలో మూలికావైద్యం ఒకటి. మూలికలు ఎన్నో
వ్యాధులు నివారిస్తాయి. వాస్తవానికి వాటిగురించి మనం పూర్తిగా తెలుసుకోవటం
చాలా కష్టం. ఈ సహజ వైద్యచికిత్సలు
చాలా వ్యాధుల నివారణకు తోడ్పడతాయి. మనదేశంలో వనమూలికలతో చేసే వైద్యాన్ని ఆయుర్వేదం
అని అంటారు. అనేక శతాబ్దాలనుండి ఆయుర్వేదం
అమలులోవుంది. ఆయుర్వేద వైద్యానికి సంబంధించి కొన్ని మొక్కలను ఎలా వాడతారో పరిశీలించండి.
షుగర్
వ్యాధికి పరిష్కారంగా ...
కరివేపాకు
- కరివేపాకును సాధారణంగా మన ఇండ్లలో చేసే
వంటకాలలో ధారాళంగా వాడతారు. అది షుగర్ వ్యాధి
నివారణలో అద్భుత ఫలితాలనిస్తుంది. 8 నుండి 10 పచ్చి ఆకులు ప్రతిరోజూ
తింటే, సుమారుగా మూడు నెలల కాలంలో
షుగర్ వ్యాధి స్ధాయిలో మార్పు వచ్చి చికిత్స లభించినట్లే.
వంశానుగతంగా వచ్చే డయాబెటీస్ కు
ఇది మంచి చికిత్స. కరివేపాకు
బరువు కూడా తగ్గిస్తుంది.
దాల్చిన
చెక్క - దీనిని కూడా వంటకాలలో ఉపయోగిస్తారు.
దాల్చిన చెక్క కూడా డయాబెటీస్
తగ్గిస్తుంది. పసుపు, లవంగాలు వంటివి కూడా షుగర్ వ్యాధి
నివారణకు వాడతారు.
ఉసిరికాయ
- షుగర్ వ్యాధి వారిలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గించాలంటే ఉసిరికాయ మంచి పరిష్కారం. పచి్చిదిగా
తినవచ్చు లేదా దానిని కాకర
రసంతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరికాయను
కనీసం రెండు లేదా మూడు
నెలలు వాడితే మంచి ఫలితాలుంటాయి.
దగ్గు
జలుబులకు మూలికల వైద్యం
తులసి
- ఇంటి పెరటిలో పెరిగే తులసి సాధారణంగా వచ్చే
దగ్గు, జలుబు వంటి వ్యాధులకు
బాగా పనిచేస్తుంది. తులసి ఆకులు తిన్నా
లేక తులసి ఆకులను నీటిలో
మరగించి టీ గా తాగినా
జలుబు త్వరగా తగ్గుతుంది.
అల్లం
- అల్లం దగ్గు, జలుబులకు మరో మంచి మూలిక
ఔషధం. పచ్చి అల్లం ముక్కలుగా
ఉప్పు కలిపి తినవచ్చు. లేదా
తేనెతో కలిపి తినవచ్చు. లేదా
అల్లం రసం కలిపిన టీ
తాగవచ్చు. దగ్గు జలుబులకు అల్లం
రసం సత్వర ఫలితాలనిస్తుంది.
దాల్చిన
చెక్క - దాల్చిన చెక్క కూడా దగ్గు,
జలుబులకు ఔషధంగా వాడవచ్చు. గొంతు నొప్పిని కూడా
మాయం చేస్తుంది. దాల్చిన చెక్క పొడి చేసి
చాయ్ లేదా కాఫీలలో వేసి
తాగితే సత్వర ఫలితాలుంటాయి. లేదా
డికాషన్ గా కూడా తాగవచ్చు.
గాయాలు
తగ్గేందుకు
క్లైంబిగ్
డేఫ్లవర్ - ఈ మొక్క యాంటీ
బాక్టీరియాగాను, యాంటి ఫంగస్ గాను
పనిచేస్తుంది. గాయాలు చర్మ వ్యాధులు త్వరగా
తగ్గాలంటే దీని రసాన్ని వైద్యంలో
వాడతారు.
మేరీ
గోల్డ్ - బంతి ఆకులను గాయాల
నివారణకు వాడతారు. పూల రేకులను రసంగా
చేసి గాయాలకు రాస్తారు.
పసుపు
- పసుపును పేస్ట్ గా చేసి గాయాలకు
రాస్తే అవి త్వరగా తగ్గుతాయి.
మన దేశ ఆయుర్వేద వైద్య
విధానంలో, మొక్కలకు, మూలికలకు ప్రధాన స్ధానం వుంది.
0 comments:
Post a Comment