గుండె
ఆరోగ్యంగా వుండాలంటే తగినంత నిద్ర కావాలని అందరకు
తెలిసినదే. అయితే, ఈ నిద్ర ఎలా
వుండాలి? గాఢ నిద్ర పోవాలా,
పగటి నిద్ర మంచిదేనా? రాత్రినిద్ర
ఎంత వుండాలి. కలత నిద్ర గుండె
ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా వంటి
సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తూనే
వుంటాయి. రాత్రివేళ మంచి నిద్ర పోతే
పగలంతా ఎంతో ఉత్సాహంగాను, ఆరోగ్యవంతంగాను
వుంటాము. కలత నిద్ర మరుసటి
రోజంతా మీకు ఎంతో నీరసాన్ని
నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
నిద్రకు
గుండె ఆరోగ్యానికి మధ్య గల సంబంధాన్ని
రీసెర్చర్లు ఎప్పటికపుడు పరిశోధన చేసి కొత్త అంశాలను
కనిపెడుతూనే వున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరిస్తే
గుండెకు ఎంతో మంచిది. ఆరోగ్యెకర
జీవన విధానం అంటే, ప్రతిరోజూ తగినంత
వ్యాయామం చేయటం, సరైన ఆహారం తినటం,
పొగతాగటం, ఆల్కహాల్ తాగటం వంటివి మానివేయటం
వంటివని గుర్తించాలి. అయితే, వీటికితోడు ప్రతిరోజూ తగినంత విశ్రాంతి కూడా అవసరమే.
అయితే,
రోజూ ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనేది వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూంటుంది. ఒక
శిశువు పగలు చాలా గంటలు
నిద్రిస్తాడు. ముసలి వయసు వారు
తక్కువగా నిద్రిస్తారు. సాధారణంగా ప్రతిరాత్రి కనీసం ఆరు నుండి
ఏడు గంటల నిద్ర అవసరం
అని వైద్యులు సిఫార్సు చేస్తారు. రాత్రివేళ ఈ మాత్రం నిద్రించిన
వారికి మరుసటి రోజు ఎటువంటి చెడు
ప్రభావం వుండదు. అయితే, ఈ 6 లేదా 7 గంటల
నిద్ర క్రమం తప్పకుండా ప్రతిరోజూ
వుండాలి. నిద్రలో మీ శరీర అవయవాలన్ని
తగినంత విశ్రాంతి పొందుతాయి కనుక, గుండెకూడా పనిచేస్తున్న
సమయంలో కొట్టుకునే రీతిలో కాక తగినంత విశ్రాంతి
తీసుకుంటూ కొట్టుకుంటుంది. వేగం తగ్గిస్తుంది. కనుక
గుండెకు కూడా విశ్రాంతి ఆరోగ్యాన్నిస్తుంది.
అమెరికన్
హార్ట్ అసోసియేషన్ నిద్ర అంశంగా ఎన్నో
పరిశోధనలు చేసింది. నిద్రకు ఊబకాయానికి, గుర్రు పెట్టటానికి, గల సంబంధాలను పరిశోధించింది.
అధిక బరువుకలవారు గాఢమైన నిద్ర పొందటమనేది చాలా
తక్కువ గంటలుగా వుంటుందని తెలిపింది. ఈ రకంగా నిద్రలేమితో
బాధపడేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం వుంటుంది.
సాధారణ శరీరాలు కలవారికి రోజుకు ఆరు నుండి ఏడు
గంటల నిద్ర సరిపోతుందని తేల్చింది.
0 comments:
Post a Comment