మహిళలు
ముఫ్పై సంవత్సరాల వయసులో పడితే చాలు, ఫలదీకరణ
అవకాశాలు తగ్గినట్లే. అంతేకాదు, 35 సంవత్సరాలు పై బడితే, గర్భం
ధరించటంలో లేదా కాన్పు జరగటంలో
అనేక సమస్యలు ఎదురవుతాయి. మహిళ వయసుకు, గర్భధారణకు
సంబంధం ఏమిటి? ఆమెలో రిలీజ్ అయ్యే
అండాలు సంఖ్యలోను నాణ్యతలోను తగ్గుతాయి. హార్మోన్స్ లో వచ్చే మార్పులు
అండోత్సర్గ సమయాన్ని మార్పు చేస్తాయి. అండాలు తగ్గుతాయి. వీర్యం తగ్గుతుంది. రతిక్రీడల సంఖ్య, తరచుగా చేయాలనే వాంఛ తగ్గుతుంది.
35 ఏళ్ళ
వయసు పైబడి గర్భం వస్తే
అది సురక్షితమా? ప్రస్తుత వైద్య విధానాలు మెరుగైనందున
ఈ వయసులో గర్భం వచ్చినా సురక్షితమే
నంటున్నారు వైద్యులు. కాని చిన్న వయసు
మహిళలకంటే వీరిలో సమస్యలు అధికం. బిడ్డ పుటుకను వాయిదా
వేస్తే, తర్వాతి రోజులలో కలిగే ఆరోగ్య అసౌకర్యాలను
బిడ్డ పుటుకలోను వచ్చే సమస్యలకు తగినంత
జాగ్రత్తలు తీసుకోవాలి.
పుట్టే
బిడ్డలో లోపాలు పెరిగే అవకాశంకూడా లేకపోలేదు. దీనికి కారణం అండం, అసాధారణంగా
వృధ్ధి పొందుతుంది. మహిళకు 35సంవత్సరాల వయసునుండి అసాధారణమైన మార్పులుశరీరంలో జరుగుతాయి. ఇరవై ఏళ్ళ మహిళలకు
పుట్టిన 1400మంది బేబీలలో ఒకరికి
డవున్ సిండ్రోమ్ కలిగితే, 40 ఏళ్ళ మహిళలకు పుట్టిన
100 మంది బిడ్డలలో ఒకరికి ఈ వ్యాధి కలుగుతోంది.
అంతేకాదు, మహిళ వయసు అధికమయ్యే
కొద్దీ గర్భవిచ్ఛిన్నం అయ్యే అవకాశాలుంటాయి. డయాబెటీస్,
రక్తపోటు వంటి సమస్యలు అధికంగా
వస్తాయి. చనిపోయిన బిడ్డ పుట్టే అవకాశాలు
కూడా వుంటాయి. సిజేరియన్ సాధారణమవుతుంది.
0 comments:
Post a Comment