రజనీకాంత్
అల్లుడు ధనుష్ హీరోగా, కూతురు
ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘3’ సినిమా తెలుగు రైట్స్ కొన్న నట్టి కుమార్...భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో
నట్టి కుమార్ చేసిన హడావుడి అంతా
ఇంతా కాదు. తాను నష్టపోవడానికి
కారణమయ్యారంటూ నట్టి కుమార్ ధనుష్,
ఐశ్వర్య, ఈ చిత్రం నిర్మాత,
ధనుష్ తండ్రి కస్తూరి రాజాపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే
తాజాగా ఓ ప్రముఖ ఆంగ్లపత్రికకు
ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి రాజా మాట్లాడుతూ....నట్టి
కుమార్ మమ్మల్ని మోసం చేశారంటూ ఆరోపించారు.
నట్టి కుమార్‘3’రైట్స్ రూ. 4.35 కోట్లకు కొనడానికి ఒప్పుకున్నాడని, తొలుత రూ. 2.50 కోట్లు
చెల్లించి అగ్రిమెంటు కుదుర్చకున్నాడని తెలిపాడు. తమకు ఇంకా ఇవ్వాల్సిన
రూ. 1.85 కోట్లుకు గాను కొన్ని చెక్కలు
ఇచ్చాడని, అయితే అకౌంట్లో డబ్బు
లేక పోవడంతో అవి బౌన్స్అయ్యారని కస్తూరి
రాజా చెప్పుకొచ్చారు.
మరో వైపు తమకు రావాల్సిన
బాకీ చెల్లించిన తర్వాతే తెలుగు శాటిలైట్స్ అమ్ముకోవాలని చెప్పినా....ఆయన తమ మాటను
లెక్క చేయలేదని, ఈ సినిమా గొడవలోకి
అనవసరంగా రజనీకాంత్, ఐశ్వర్య, ధనుష్లను లాగారని
కస్తూరి రాజా వెల్లడించారు. నట్టి
కుమార్ చేసిన ఈ మోసంపై
కోర్టు కెక్కేందుకు కస్తూరి రాజా తన లాయర్లను
సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘త్రీ’ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం
వై దిస్ కొలావరి పాటతో
పాపులర్ అయ్యింది. ఆ పాట క్రేజ్
తో ఈ చిత్రం వర్కవుట్
అవుతుందని అంతటా భావించారు. అయితే
ఆ పాట జనాలని కేవలం
ధియోటర్స్ కి లాక్కురావటానికి మాత్రమే
తోడ్పడింది. అంతేగాక చిత్రంలో ఆ పాటే మైనస్
అయింది. యూట్యూబ్ లో ఆ పాట
పాపులర్ అయిన విధంగా సినిమాలో
కిక్కు ఇవ్వలేకపోయింది. ఈ నేపధ్యంలో నట్టికుమార్
ఈ సినిమా ప్రమేషన్ ప్లస్ అవుతుందని భావిస్తే
అదీ వారు రాకపోవటంతో నిరాశకు
గురయ్యారు.
0 comments:
Post a Comment