పవన్
కళ్యాణ్ తాజా చిత్రం “గబ్బర్
సింగ్”
ఆంధ్రాలో విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్
సునామీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక
మిగతా ఏరియాలో కూడా ఇదే విధమైన
హవా కనపడుతోంది. అమెరికా,తమిళనాడు,కర్ణాటకలో ఎవరూ ఊహించని విధంగా
కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ కలెక్షన్స్ ట్రేడ్
నిపుణులుని షాక్ కు గురి
చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లో గబ్బర్ సింగ్
కలెక్షన్స్..బాలీవుడ్ చిత్రాలకన్నా ఎక్కువ వసూలు చేస్తోందని బాలీవుడ్
ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వ్యాఖ్యానించాడు.
తరుణ్
ఆదర్శ్ తన ట్విట్టర్ లో....గబ్బర్ సింగ్ సినిమా ఈ
వీకెండ్ మొత్తం కలిసి $577,090 రాబట్టిందని చెప్పారు. బాలీవుడ్ చిత్రాల థియేటర్లతో పోలీస్తే మూడో వంతు థియేటర్లో
విడుదలైన ఈ చిత్రం వాటి
కన్నా ఎక్కువ రాబట్టింది అన్నారు. అలాగే ఈ చిత్రం
కలెక్షన్స్ జోరు మరికొంత కాలం
కొనసాగుతుందని.. మరింత ఎక్కువగా అమెరికాలో
బిజినెస్ చేస్తుందని అన్నారు. ఫ్యాన్స్ కి నచ్చిన ఈ
చిత్రం అమెరికాలో ఒక్కొక్కరూ ఒకటికి నాలుగు సార్లు చూస్తున్నారని అక్కడున్న మనవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక తమిళనాడు బిజినెస్ విషయానికి వస్తే...తమిళ ట్రేడ్ విశ్లేషకుడు
శ్రీధర్ పిళ్ళై తన ట్విట్ లో
ఈ చిత్రం కలెక్షన్ గురించి రాసుకొచ్చారు. ఆయన మాటల్లో...తమిళనాడులో
ఇరవై ఐదు స్క్రీన్స్ తో
విడుదలైన ఈ చిత్రం ఎక్కడా
డ్రాప్ కాలేదు. చెన్నైలో కూడా అద్బుతమైన ఓపినింగ్స్
వచ్చాయి. స్ట్రైయిట్ తమిళ సినిమా మాదిరి
ఈ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకూ రిలీజైన చిత్రాల్లో ఈ రేంజి ఓపినింగ్స్
ఈ చిత్రానికే వచ్చాయి. చాలా మల్టిప్లెక్స్ లు
రెండో రోజు కూడా హౌస్
ఫుల్ కలెక్షన్స్ తో పూర్తిగా గబ్బర్
సింగ్ నే ప్రదర్శిస్తున్నాయి. తమిళేతర చిత్రానికి
ఈ ఆదరణ రావటం అపూర్వం
అని ప్రశంశించారు.
గబ్బర్
సింగ్ కలెక్షన్స్ ఆంద్రాలో ఈ వీకెండ్ మూడు
రోజులు దుమ్ము దులిపాయి. చాలా చోట్ల మల్టిప్లెక్స్
లలో మిగతా సినిమాలు తీసేసి..కేవలం గబ్బర్ సింగ్
నే ప్రదర్శించారు. ఎక్కడ చూసినా హౌస్
ఫుల్ బోర్డ్ లు కనపడ్డాయి. మూడో
రోజు కూడా బ్లాక్ లో
టిక్కెట్లు అమ్మటం ఈ సినిమా విజయం
రేంజి ని తెలుపుతోందని చెప్తున్నారు.
సినిమాకు ప్లస్ అయిన ఎంటర్టన్మెంట్
గురించి అంతటా హాట్ టాపిక్
గా నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత
పవన్ కి వచ్చి ఈ
హిట్ అని అభిమానులంతా పండుగ
చేసుకుంటున్నారు.
0 comments:
Post a Comment