ప్రముఖ
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ మూవీ మే
30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 21న
ఈ చిత్రం ఫస్ట్ కాపీ సెన్సార్
బోర్డు పరిశీలనకు వెళ్లనుంది. ఈ చిత్రం క్లీన్
‘యూ’ సర్టిఫికెట్ సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమా
మొత్తం ఇద్దరు ప్రేమికులు, ఈగ చుట్టూ తిరుగుతుంది.
అందువల్ల సినిమాలో అశ్లీల సన్నివేశాలు గానీ, భారీ హింసాత్మక
సంఘటనలు గానీ ఉండే అవకాశాలు
లేవు. పైగా ఈగ చేసే
విన్యాసాలు చిన్న పిల్లలను కూడా
అలరించే విధంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి
క్లీన్ యూ సర్టిపికెట్ రావడం
ఖాయమని భావిస్తున్నారు.
కాగా
ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఈ నెల 30 విడుదల
చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక వేళ అప్పటి
వరకు సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాక
పోతే ఆ సీన్ను లేకుండానే
సినిమాను విడుదల చేసి....ఆ వర్కు పూర్తయిన
తర్వాత సినిమాలో కలిపి రీ రిలీజ్
చేసే యోచనలో ఉన్నరట దర్శక నిర్మాతలు. జూన్
నెల మొదలైతే సమ్మర్ హాలీడేస్ ముగుస్తాయి. ఈనేపథ్యంలో కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం ప్రారంభం
రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని
రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి
చిత్రం కావటం, కొత్త కాన్సెప్టుతో
ఈ చిత్రం రూపొందుటుండటం, పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే
కథ కావటం సినిమాపై అంచనాలు
పెంచుతున్నాయి. ఈ చిత్రంలో నాని
సరసన సమంత హీరోయిన్ గా
చేస్తోంది. కన్నడ నటుడు సుదీప్
విల్ పాత్రలో పోషిస్తున్నాడు.
‘ఈగ’ చిత్రం
విడుదలకు ముందు స్టోరీ మొత్తం
చెప్పేసిన దర్శకుడు రాజమౌళి....తన డైరెక్షన్ సత్తాను
చాటుకున్నాడు. ‘తను ప్రేమించిన అమ్మాయితో
హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న
ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్
చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత
జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై
ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ
ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన
ఓ మనిషిపై..అదీ ఓ పరమ
క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం
ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.
0 comments:
Post a Comment