బాలకృష్ణ
ప్రత్యేక పాత్ర పోషిస్తున్న చిత్రం
'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. మంచు మనోజ్ హీరోగా
చేస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ
ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చంద్రముఖి
తరహా భవంతిలోకి హీరో మనోజ్ ప్రవేశించాక
కథ మొదలవుతుందని,అక్కడ బాలకృష్ణ ఆత్మ
కలుస్తుందని చెప్పుకుంటున్నారు. హర్రర్,కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ
ప్లాష్ బ్యాక్ విన్న హీరో ఆయన
ఆశయం తీర్చటం కథ అంటున్నారు. ఈ
చిత్రాన్ని కృష్ణ వంశీ శిష్యుడు
శేఖర్ రాజా రూపొందిస్తున్నారు.
ఇక ఈ చిత్రం కోసం
ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు
చేసి మరీ భవతి సెట్
వేసారు. ఆ భవంతి పేరు
గంధర్వ మహల్. కధలో ఎక్కవ
భాగం అక్కడే జరుగుతుంది. ఈ చిత్రంపై నిర్మాత
మంచు లక్ష్మికి చాలా నమ్మకం ఉంది.
అందుకే విపరీతంగా ఖర్చుపెడుతున్నారని చెప్తున్నార. హైదరాబాద్ ..పుప్పాల గూడాలో ఈ సెట్ ని
చూసిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆశ్చర్యపోయారు.
దాసరి
మాట్లాడుతూ... 'ఇదొక అద్భుతం. మోహన్బాబు అయితే ఇంత
ఖర్చు చేసేవాడు కాదు. ఈ సెట్
కోసం చెక్పై సంతకం
చేసినప్పుడల్లా ఉలిక్కిపడి ఉంటాడు. రేపు ఈ సినిమా
సాధించే విజయాన్ని చూసి ఇంకా ఉలిక్కిపడతాడు.
ఓ బ్రహ్మాండమైన సినిమా అవుతుంది. బాలయ్య పాత్రను, అభినయాన్ని సంచలనం సృష్టిస్తుంది' అన్నారు.
బాలకృష్ణ
సైతం ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ... 'శ్రీరామ రాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా
చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ
వరం' అని అన్నారు. ఇందులోని
పాత్రలకు, గంధర్య మహల్ సెట్‌కు
వున్న సంబంధమేంటో సినిమా చూశాకే తెలుస్తుందని, జూన్లో చిత్రాన్ని
విడుదల చేస్తామని లక్ష్మీ ప్రసన్న తెలిపింది. రీసెంట్ గనే ఈ చిత్రం
లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
0 comments:
Post a Comment